పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానంవల్ల మనకు చాల లాభాలు చేకూరుతాయి. తోబీతు ఈలా చెప్పాడు. “ధనం కూడబెట్టుకొని దుష్టజీవితం జీవించడంకంటె ವಿಪ್ತಕುದ್ದಿಟ್ ప్రార్ధన చేయడం మేలు, మంచి జీవితం గడుపుతూ దానధర్మాలు చేయడం మెరుగు. బంగారాన్ని కూడబెట్టుకోవడంకంటె దానం చేయడం మంచిది, దానం మిమ్మ మృత్యువునుండి కాపాడుతుంది. మీ పాపాలనెల్ల కడిగివేస్తుంది. దానం చేసేవాళ్ళ దీర్గాయుష్మంతులౌతారు" తోబీ 12, 8-9

అనాథులకూ పేదలకూ చేసే దానధర్మాలను దేవుడు తన అంగుళీయాన్నిలా విలువతో చూస్తాడు

అనాథులకు తండ్రివలె వుండు
వితంతువులకు వారి భర్తవలె సాయం చేయి
అప్పడు నీవు మహోన్నతుడైన దేవునికి పుత్రుడమోతావు
అతడు నీ సొంతతల్లికంటెగూడ అధికంగా నిన్ను ప్రేమిస్తాడు
నరుడు పేదలకు చేసిన దానధర్మాలను
ప్రభువు తన అంగుళీయాన్నివలె విలువతో జూస్తాడు
నరుడు పేదలపట్ల చూపే కరుణను
ప్రభువు తన కంటిపాపనులాగ మన్ననతో జూస్తాడు - సీరా 410. 17,22

దానంద్వారా మనం పరలోకంలో నిధిని కూడబెట్టుకొంటాం. యుద్ధంలో డాలులా అది మనలను కాపాడుతుంది. •

పేదసాదలను సానుభూతితో చూడు
వారిచే దీర్ఘకాలం బతిమాలించుకోకు
నీ కాసులను ఏ బండక్రిందనో దాచి
త్రుప్పపాలు చేయడంకంటె
వానిని నీ పొరుగువాని కొరకో స్నేహితుని కొరకో
వెచ్చించడం మేలు
దైవాజ్ఞ సూచించినట్లే
దానధర్మాలనే నిధిని ప్రోగుజేసికో
ఆ నిధి నీకు-బంగారంకంటె అధికంగా ఉపయోగపడుతుంది
పేదలకు ఇచ్చిందే నీవు భద్రపరచిన నిధి అనుకో
అది నిన్ను సకలాపదలనుండి కాపాడుతుంది