పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. నైతిక వర్తనం

1. విజ్ఞాన గ్రంథాలకు పరిచయం

1. జ్ఞాన గ్రంథాలు

మామూలుగా పూర్వవేదంలో ఏడు గ్రంథాలను విజ్ఞాన గ్రంథాలు అని పిలుస్తారు. అవి యోబు, సామెతలు, ఉపదేశకుడు, సీరా జ్ఞానం, సాలోమోను జ్ఞానం, పరమగీతం, కీర్తనల గ్రంథం అనేవి.

2. యిప్రాయేలు విజ్ఞానానికి ఆధారం

యిస్రాయేలీయులకంటె ముందుగానే వారి యిరుగు పొరుగు దేశాలైన ఈజిప్టు, మెసపొటామియా, కనాను, అరేబియా మొదలైనవి విజ్ఞానాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. యిస్రాయేలు రచయితలు ఈ దేశాల విజ్ఞానాన్ని కొంతవరకు వాడుకొన్నారు. వాళ్ళ సాంత విజ్ఞానాన్ని కూడ పెంపొందించుకొన్నారు. యూదులు మోషేను ధర్మశాస్త్రానికి, దావీదును కీర్తనలకూ ఆధారం చేసినట్లే, సొలోమోను రాజును విజ్ఞానానికి ఆధారం చేసారు. యిర్మీయా ప్రవచనం 18,8 నుండి యూద సమాజంలో యాజకులకూ, ప్రవక్తలకూ, జ్ఞానులకూ సమానమైన హోదా వుండేదని తెలుస్తుంది.

3. అన్యజాతుల విజ్ఞానమూ, యూదుల విజ్ఞానమూ

అన్యజాతుల విజ్ఞానం కేవలం లౌకికమైంది, దానికి దేవునితో సంబంధంలేదు, మన దేశంలో పుట్టిన విజ్ఞానం కూడ ఈలాంటిదే. కాని యూదుల విజ్ఞానం పూర్తిగా మతపరమైంది. వాళ్ళ ఆలోచనల ప్రకారం, విజ్ఞానానికి మొదటి మెట్టు దైవభీతి.

4. విజ్ఞానమంటే యేమిటి?

జ్ఞానగ్రంథాలు జీవితం, మరణం, కష్టాలు, చెడ్డ, ప్రేమ, నరుడు భగవంతునితోను నరునితోను మెలిగే తీరు మొదలైన అంశాలను పేర్కొంటాయి. మంచి జీవితం ఏలా జీవించాలో, దానిద్వారా సుఖశాంతులూ విజయమూ ఏలా సాధించాలో చెప్తాయి. జీవితంలో ఎదురయ్యే నానా సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాయి. రాజకీయాల్లో నేర్పూ కళల్లో ప్రావీణ్యం, బాలురకు విద్యగరపడం మొదలైన అంశాలనుకూడ ప్రస్తావిస్తాయి. నరునికి సామాన్య పరిజ్ఞానాన్ని నేర్పుతాయి. కాని ఈ యంశాలన్నిటినీ లౌకిక పద్ధతిలోకాక