పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు తన తండ్రిసమక్షంలో కూర్చుండి రాజుగా పరిపాలనం చేస్తుంటాడు. మరియగూడ ఆ క్రీస్తుతోపాటు తానూ రాబ్దిగా పాలనం చేస్తుంది. మనతరపున ఆమె చేసే వేడుదలే ఆమె రాచరికం. మరియు రాజ్జీత్వంకూడ ఆమె దైవమాతృత్వం యొక్క ఫలితమే. ఈ విధంగా మరియమాత మంగళగుణాలన్నీ ఆమె దివ్యమాతృత్వం వలననే సిద్ధించాయని చెప్పాలి. కనుక దేవుడు తన రక్షణ ప్రణాళికలోనే ఆమెను దేవమాతనుగా ఎన్నుకున్నాడు.

3. మరియ - శ్రీసభ

మనుష్యావతారం అంటే దేవుడు నరుడు గావడం మాత్రమేగాదు, నరులు ఆ దేవుని దేహం గావడంకూడా, అనగా క్రైస్తవసమాజం లేక శ్రీసభ ఏర్పడ్డంగూడ, ఈ శ్రీసభలో మరియు మొదటి వ్యక్తి కనుక ఆమె శ్రీసభ కంతటికీ పోలికగా, ఆదర్శంగా వుంటుంది. ఇక మానుష క్రీస్తునకు అతని తల్లికీ ఏలాంటి మహిమాన్విత లక్షణాలు సిద్ధించాయో శ్రీసభకూ ఆలాంటి లక్షణాలే సిద్ధిస్తాయి. శ్రీసభ అంటే క్రైస్తవ ప్రజలమైన మనమందరమూను. కనుక మనకందరకూ క్రీస్తు మరియలకు ఒనగూడిన లక్షణాలే ఒనగూడుతాయి. మరియు మహిమలు ఆమెకోసం మాత్రమేగాదు, శ్రీసభ కోసమూ మనకోసమూను. మరియ గుణాలు శ్రీసభలోను మనలోను ఏలా ప్రతిఫలిస్తాయో విచారించి చూద్దాం.

మరియ ఓ మాతృమూర్తి, అదేవిధంగా శ్రీసభకూడ మాత. జ్ఞానస్నానంద్వారానే శ్రీసభ మనలను కంది. క్రైస్తవుడుకూడ ప్రేషితుడుగా వ్యవహరించినప్పుడల్లా క్రీస్తుబిడ్డలను కంటాడు. తల్లీ తండ్రీ ఔతాడు - గల 4,19. శ్రీసభ మాతృత్వానికీ మరియు మాతృత్వానికీ, ఒక భేదం వుంది.
శ్రీసభ క్రీస్తు దేహమైన క్రైస్తవులను మాత్రమే కనగలదు. ఈ దేహానికి శిరసైన క్రీస్తును కనలేదు. జజ్ఞానదేహపు శిరసైన క్రీస్తును కనగల్గిన తల్లి మరియ ఒకర్లే. అది ఆమె సాధించిన మహాకార్యం. ఆమె మహత్వం కూడ అదే.
నిష్కల్మషుడైన దేవుణ్ణి మన మానుషజాతిలోనికి ప్రవేశపెట్టడంకోసం మరియ నిష్కల్మష కావలసివచ్చిందన్నాం. క్రీస్తు దేహమూ క్రీస్తుపత్నీ ఐన శ్రీసభకూడ నిష్కల్మష కావాలి - ఎఫే 5,27. శ్రీసభ సమస్తంగా తీసికొంటే నిష్కల్మష ఐనా వ్యస్తంగా తీసికొంటే, అనగా తన సభ్యులందు కల్మషగానే వుంటుంది. ఈ సభలో సంపూర్ణ నిష్కల్మష ఒకరే, 47