పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదేమో. ఈలాంటి పరిస్థితుల్లో మరియ క్రైస్తవ పురుషులకంటెగూడ క్రైస్తవ స్త్రీకి ఎక్కువ ఆదర్శంగా వుంటుంది. ఆమె పురుషుడుకాదు. స్త్రీ, ఆ మాతృమూర్తి స్త్రీ హృదయంతో తన కొమార్తెల మానసిక బాధలను అర్థం జేసికొంటుంది. తాను వాళ్ళపట్ల సానుభూతి జూపుతుంది. తన పత్రికల బాధోపశమనానికి అవసరమైన వరప్రసాదాన్ని ఆర్థించి పెడుతుంది. కనుక క్రైస్తవ గృహిణి కష్టాల్లో ఆ తల్లివైపు దృష్టిమరల్చి ఆమె సహాయం అడుగుకోవాలి.

12. మరియమాత - సమైక్యత

మరియమాత ఈ ప్రపంచాన్నంతటినీ క్రీస్తుతో ఐక్యపరుస్తూంటుంది. విశ్వజనాన్ని విశ్వమతాలనూ, క్రీస్తుతో జోడిస్తుంటుంది. ఈ యధ్యాయంలో క్యాథలిక్ ప్రోటస్టెంటు శాఖలకూ, హిందూ ముస్లిం శాఖలకు చెందినవాళ్ళను ఆ విశ్వజనని ఏలా ఐక్యపరుస్తుందో విచారించి చూద్దాం.

1. ప్రోటస్టెంటు శాఖలు

నేడు ప్రోటస్టెంటు శాఖలు చాలవున్నాయి. కాని మొదటి శాఖలు లూథరెన్, కాల్వినిష్ణ శాఖలు రెండే. మరియమాత క్రైస్తవ శాఖలన్నిటినీ - అవి క్యాథలిక్ సమాజానికి జెందినా ప్రోటస్టెంటు సమాజానికి చెందినాసరే - క్రీస్తుతో ఐక్యపరుస్తుండాలి. కాని అనేక కారణాలవల్లా, అపార్ధాలవల్లా ఆ తల్లి క్యాథలిక్ క్రైస్తవులకూ ప్రోటస్టెంటు క్రైస్తవులకూ విభజన కారణమైందిగాని ఐక్యతాకారణం కాలేదు. ఈ సమస్యను కొంచెం చారిత్రిక దృష్టితో తర్కించడం అవసరం.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతనుగూర్చి విశ్వసించే అంశాలను ముందటి అధ్యాయాల్లో విచారించాం. ఇక 16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు తిరుగుబాటు వచ్చింది. లూథరు కాల్విను మొదలైన నాయకులు చీలిపోయారు. ఆదిమ క్రైస్తవసమాజం క్యాథలిక్ సమాజంలో కొనసాగుతూవచ్చింది. చీలిపోయిన నాయకులు మాత్రం ఆదిమ క్రైస్తవ సమాజం విశ్వసించే సూత్రాలకు భిన్నమైన సూత్రాలను కొన్నిటిని తమ క్రొత్తశాఖల్లో ప్రవేశపెట్టుకున్నారు. ఈలా ప్రవేశపెట్టుకున్న సూత్రాల్లో ప్రస్తుతం మరియమాతకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారించి చూద్దాం.

లూథరు కాల్వినుగూడ మరియమాత దేవమాత అని ఆంగీకరించారు. ఆమె పవిత్రురాలనీ, నిత్యకన్య అనీ భావించారు. కాల్విను మాత్రం ఆమెకు జన్మపాపం సోకిందన్నాడు. ఆమె ఉత్థాపనాన్ని ఇద్దరూ అంగీకరించలేదు. ఆమె మనకోసం క్రీస్తుకు మనవిచేస్తుందనే అంశాన్ని కూడ ఇద్దరూ నిరాకరించారు.