పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కని పెంచి పెద్దజేసింది. అతనికి విద్యాబుద్ధులూ దైవభక్తీ నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఏలా ఆరాధించాలో బోధించింది. ఆలాగే మరియ గురువులకుకూడ మాతయై వాళ్ళకుకూడ విద్యాబుద్ధులూ దైవభక్తీ దైవారాధన నేర్పుతుంది. క్రీస్తు గురువునకు తల్లియైన మరియ ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులకుగూడ గారాబు తల్లి,

           గొర్రెపిల్లను బలికి సిద్ధంజేసినట్లుగా మరియ క్రీస్తుని సిలువయాగానికి సిద్ధంజేసింది. కడన ఆ బలిమూర్తిని కల్వరి కొండమీద తండ్రికి సమర్పించింది. అంతమాత్రమే గాదు, క్రీస్తుతోపాటు తాను బలిమూర్తి అయింది. క్రీస్తుతో పాటు తన్నుతాను పరలోకపితకు సమర్పణం చేసికొంది. ఈ సమర్పణ కార్యంలో ఆమె గురువుకి తోడ్పడుతుంది. ఆమె గురువు హృదయంలో భక్తిభావాలు పుట్టించి అతడు యోగ్యంగా తన్ను తాను దేవునికి నివేదించుకొనేలా చేస్తుంది.
          క్రీస్తు జననానికి మరియ భక్తిభావంతో తయారైంది. ఆ ప్రభుని ఆమె మనసార నమ్మింది. అందుకే ఎలిసబేత్తుకూడ "ప్రభువు పలుకులు విశ్వసించిన నీవు చాల ధన్యురాలవు" అని మరియను పొగిడింది. గురువుకూడ పీఠంమీద క్రీస్తు జన్మించేలా చేసేవాడు. అంచేత అతనికి గూడ మరియకున్న విశ్వాసమూ భక్తీ వుండాలి. మరియ తన వేడుకోలుద్వారా గురువు విశ్వాసుల హృదయాల్లో క్రీస్తుని పుట్టించేలా చేస్తుంది.
        మరియు గొప్ప ప్రేషితురాలు. ఆమె పన్నెండు మంది ప్రేషితుల్లో ఒకతెగాదు, కాని ఆమె వస్తుతః ప్రేషితురాలు. ప్రేషితుల రాజ్ఞికూడ. ఆమె సాధించిన గొప్ప ప్రేషితకార్యం లోకానికి క్రీస్తుజ్యోతిని ప్రసాదించడం. అనగా క్రీస్తుని కనడం. తాను కన్న క్రీస్తుని ఆ విశ్వజనని రకరకాలరూపాల్లో ఆనాటి ప్రజలకు అందించింది. ఈ నాడుకూడ ఆ విజ్ఞాపనమాత మోక్షంనుండి విశ్వాసులకోసం ప్రార్ధనచేస్తూ వాళ్ళకు క్రీస్తుని అందిస్తూనే వుంటుంది. ఇక, గురువుకూడ మరియలాగే క్రీస్తుని విశ్వాసులకు అందించేవాడు. గురువు మొదట క్రీస్తుని తాను పొందేలా, అటుతరువాత తానుపొందిన క్రీస్తుని విశ్వాసులకు అందించేలా తోడ్పడుతుంది మరియ.

2. మరియ మఠకన్యలకు ఆదర్శం

                నరుడు నిర్దోషంగాను పవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభువు కోరుకొన్నట్లుగా నిర్మలజీవితం జీవించిన పునీతురాలు మరియ. ఆమె యేనాడూ పాపపు బురదలో అడుగు పెట్టలేదు. మానవమాత్రుల్లో యింత నిర్మలంగా జీవించిన వ్యక్తి మరెవ్వరూ లేరు. అందుచేత మరియు ప్రభువుకి సర్వవిధాలా ప్రియపడింది. ఇక, మఠకన్యగూడ శరీరాన్నీ హృదయాన్నీ ప్రభువకే అంకితం జేసికొని ప్రభు సంబంధమైన
                                                         38