పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిశాచం ఆ తొలిస్త్రీని వంచించింది. యేవ మోసపోయింది. ఆమె పిచ్చిదై పిశాచం పలుకులు స్వీకరించింది. హృదయంలో నిల్పుకుంది. తన కడుపులో విషం తాల్చింది. కాని ఈ రెండవ స్త్రీ పిశాచం పలుకులకు మోసపోలేదు. ఈమె గబ్రియేలుదూత పలుకులను స్వీకరించింది. తన హృదయంలో నిల్పుకుంది . తన గర్భంలో జీవాన్ని ధరించింది. ఆ స్త్రీ మనకు విషాన్ని అందించింది. కాని ఈ స్త్రీ అమృతాన్ని ప్రసాదించింది.

నాడు ఆ తోటలో చెట్టుదగ్గర నిలుచుండి సైతానుమాటలకు మోసిపోయింది ఆ తెలివితక్కువ కన్య. మళ్ళా మరో చెట్టదగ్గర, అనగా సిలువ చెంత నిలుచుండి సైతానుని జయించింది ఈ తెలివిగల కన్య. ఆనాడు సైతాను కన్య పాదం కరిచింది. ఈనాడు ఈ కన్య సైతాను తలనే కాలితో నలగడ్రొక్కింది. పిశాచం ఆనాడు తాను పొందిన విజయాన్ని తలచుకొని పొంగిపోయింది. కాని ఈనాడు తాను పొందిన పరాభవానికి క్రుంగిపోయింది. “ఆనాడు ఆ కన్యను మోసగించి నేను పాముకుందిమాత్రం ఏముంది? మెదలకుండా వున్నా బాగుండేదిగదా? అని విచారించింది. పిశాచం దేవుడు ఓడిస్తే ఓర్చుకుంటుందిగాని కేవలం ఓ సృష్టిప్రాణి ఓడిస్తే ఓర్చుకోలేదుగదా! ఐనా మరియమాత ఓడించందే పిశాచం ఓటమి పూర్తి యోటమి కాజాలదు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని జయించి ఆనాడు తాను పూర్తిగా నెగ్గింది. మళ్ళా ఒక పురుషుడూ ఒక స్తీ గాని దానికి పూర్తిగా శృంగభంగం జరుగదు.
తొలి ఆదాము పాపంచేసాడు. అతడు నరజాతికి శిరస్సు కావున అతని పాపం మనకూ సంక్రమించింది. కాని ఆ తొలి ఆదాము పాపంలో ఓ స్త్రీకూడ పాల్గొంది. ఏవ మన తలగాదు గనుక ఆమెపాపం తనంతటతాను మనలను నాశంజేసి వుండదు. కాని ఆదాము పాపంతోగూడి ఆమె పాపంగూడ మనకు నాశం దెచ్చిపెట్టింది. ఇక ఒక పురుషుడు ఒక స్త్రీ మనకు నాశం దెచ్చిపెట్టినట్లే, మళ్ళా ఒక స్త్రీ ఒక పురుషుడు మనకు రక్షణం దెచ్చిపెట్టారు. ఏవ మన పతనంలో పాల్గొన్నట్లే మరియ మన ఉద్ధరణంలో పాల్గొంది. మరియ తనంతటతాను మనలను రక్షించి వుండలేదు. ఆమె మన తలగాదు. రక్షకుడేమో క్రీస్తే. కాని క్రీస్తు రక్షణంలో తానూ పాల్గొనడంవల్ల క్రీస్తుతో, క్రీస్తునందు, తానూ మన రక్షకి అని చెప్పబడుతుంది.
నేడుమనం మరియమాతను గౌరవించడంలో ఉద్దేశం యిది. తొలియేవ మన పతనంలో పాల్గొన్నట్లే మలియేవ మన ఉద్ధరణంలో పాల్గొంది. ఆదాము పాపంతో గలిసి తొలియేవ పాపం మనలను నాశంజేసింది. క్రీస్తు పరిహారంతో ఐక్యమై మలియేవ పరిహారం మనలను రక్షించింది. యథార్థంగా పాపియేమో ఆదామొక్కడే, రక్షకుడేమో క్రీస్తు ఒక్కడే కాని అతనితోను ఇతనితోను ఓ స్త్రీని జోడించడం దేవునిచిత్తమైంది. రక్షణగాథలో ఆయేవా