పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియ మనకు రకరకాల వరప్రసాదాలు ఆర్థించి పెడుతుంది. కాని ఆమె ఇచ్చే ప్రధాన వరప్రసాదం క్రీస్తే. మరియ క్రీస్తనే పండ్లను కాసిన ద్రాక్షతీగ. క్రీస్తనే వెన్ను వేసిన గోదుమ పైరు. ఈ గోదుమ అప్పం, ఈ ద్రాక్షసారాయం మన పూజలో క్రీస్తుగా మారిపోతాయి. కనుక ఆ తల్లి రోజురోజు మనకు క్రీస్తనే భాగ్యాన్ని ప్రసాదిస్తుండాలని అడుగుకుందాం.

మరియను తల్లిగా బొందడమూ, ఆమెను ప్రేమించడమూ గొప్పభాగ్యం. మరియమాతపట్ల భక్తిలేనివాళ్లు దిక్మూమొక్మూలేని అనాథశిశువుల్లా అలమటించి పోతారు. 12వ శతాబ్దపు భక్తుడైన ఆన్సెల్మ్ "ఓ ప్రభూ! నీవు మీ తల్లిని ఎంతగా ప్రేమించావో, మేముకూడ ఎంతగా ప్రేమించాలని కోరుకొంటున్నావో, అంతగా ఆ తల్లిని ప్రేమించేభాగ్యం నీ మాతృ ప్రేమద్వారా మాకు ప్రసాదించు" అని ప్రార్థించాడు. కాని క్రీస్తు ఎంతగా కోరుకొంటూన్నాడో అంతగా ఆ తల్లిని ప్రేమిస్తున్నామా?

8. ఇద్దరు ఏవలు

క్రైస్తవమతానికి ఆధారాలు రెండు : బైబులు, పితృపాదుల బోధలు. ఈ రెండవదానినే పారంపర్యబోధ అంటాం. పితృపాదులు గ్రీసు, సిరియా, లాటిను దేశాలకు చెందినవాళ్ళ వీళ్ళ గ్రీకు, సిరియను, లాటినుభాషల్లో ప్రజలకు బోధించారు, రచనలు చేసారు. గ్రీకు పిత్రుపాదుల్లో క్రిసోస్తం, అలెగ్జాండ్రియా సిరిల్, గ్రెగోరీనీస్సా, గ్రెగోరీ నాసియాన్సన్, జాన్ డమసిన్ మొదలైనవాళ్ళు ముఖ్యలు. లాటిను పితృపాదుల్లో అగస్టీన్, జెరోము, అంబ్రోసు ముఖ్యలు. సిరియను పితృపాదుల్లో ఏ ఫ్రేము ముఖ్యడు. వీళ్ళంతా క్రీస్తుశకం 2-5 శతాబ్దాల మధ్యలో జీవించినవాళ్ళు అంతా పునీతులు. చాలమంది బిషప్పలు కూడ. వీళ్ళ బోధలు ఇప్పడు గ్రంథరూపంలో లభిస్తాయి.

క్రైస్తవ మతాంశాలన్నీ స్పష్టంగా బైబుల్లో లేవు. కొన్ని అంశాలు పితృపాదుల బోధల్లో మాత్రమే వుండిపోయాయి, అందుకే శ్రీసభ బైబులుతోపాటు పారంపర్య బోధనుకూడ గ్రహించింది. మనకు బైబులు ఎంత ప్రమాణమో పారంపర్య బోధకూడ అంత ప్రమాణం. పరిశుద్ధ రచయితలను ప్రేరేపించి బైబులు గ్రంథాలను వ్రాయించిన పరిశుద్ధాత్మే పితృపాదులను కూడ ప్రేరేపించి వాళ్ళ చేత ఆయా క్రైస్తవ సత్యాలను చెప్పించింది.

16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు శాఖలు ఆదిమ క్రైస్తవ సమాజంనుండి చీలిపోయాక పారంపర్య బోధను గ్రహించడం మానివేసాయి. బైబులును మాత్రమే ప్రమాణంగా స్వీకరించాయి. ఈ కారణంచేతనే నేడు క్యాతలిక్ సమాజానికి ఇతర