పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/317

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేళనో ప్రాతఃకాలాన్నో యెప్పడు వస్తాడో విూకు తెలియదు. కనుక విూరు మేల్కొనివుండండి" - మార్కు 13,35. కనుక మనం భక్తిగల క్రైస్తవ జీవితం జీవిస్తూ నిరంతరం మేల్కొనివుండాలి. అంత్యదినాన ప్రభువు వచ్చినపుడు మనం అవివేకవతులైన కన్యల్లాగ సత్ర్కియలనే చమురులేకుండా ఉండకూడదు. వివేకవతులైన కన్యల్లాగ మంచి పనులనే చమురుచేకూర్చుకొని ఉండాలి - మత్త 25,8-9.

3.రెండవ శతాబ్దానికి చెందిన టెర్టూలియన్ అనే వేదశాస్తి రైతు పంటకోసం వేచివున్నట్లుగా, యుద్ధం జేసే సైనికులు యుద్దాంతంకోసం వేచివున్నట్లుగా, క్రైస్తవుడు ప్రభువు రాకడకోసం వేచివుండాలని వ్రాసాడు. ప్రభుని భక్తితో సేవించేవాళ్ళకు అతని రాకడ ఎంతో ఆనందాన్నిస్తుంది. కనుక వాళ్లు ఆ సుదినంకొరకు ఉవ్విళూరుతూండాలి.

4.ఈ లోకంలో ప్రభువుకొరకు వేచివున్నపుడు మనకు దివ్యబలాన్నీ శక్తినీ దయచేసేవి దేవద్రవ్యానుమానాలు. వీటిల్లోగూడ దివ్యసత్ర్పసాదం విశేష బలాన్ని చేకూర్చిపెడుతుంది. అది మనకు ప్రభువు దివ్యజీవనాన్ని ప్రసాదిస్తుంది. “ఈ రొట్టెను తిని ఈ పాత్రనుండి త్రాగినపుడెల్ల, ప్రభువు రెండవసారి వచ్చేవరకూ మనం అతని మరణాన్ని ప్రకటిస్తూంటాం." - 1కొ 11,25, కావున భక్తులు ఈ దివ్యభోజనాన్ని యోగ్యంగా స్వీకరిస్తూ ప్రభువు రెండవ రాకడకు సిద్ధమౌతూండాలి.

8. క్రీస్తు మనకు ఓడలంగరు

క్రైస్తవుడు ప్రధానంగా నిరీక్షణతో జీవించేవాడు. ఐనా అతడు ఈ లోకంనుండి తప్పించుకోవాలని కోరుకోదు, ఇక్కడ చక్కగా కృషిచేసి ఈ భౌతిక ప్రపంచాన్ని వశం చేసుకోవాలని కోరుకొంటాడు. ఈ కృషివల్లనే అతనికి రక్షణం లభిస్తుంది. ఈ చివరియధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. క్రైస్తవనీకి నిరీక్షణం ప్రధానం

క్రైస్తవుడు ప్రధానంగా ఆశించేదేమిటి? తన మరణకాలంలో ఉత్తానక్రీస్తుని కలసికొని ఆ ప్రభువునుండి బహుమతిని పొందాలనే. “మనం పరలోక పౌరులం. దివి