పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉండదు. మహిమను పొందిన తిరుసభ మాత్రం ఉంటుంది. కనుక తిరుసభ ఏనాటికీ నాశంకాదు. అది లోకాంతంలో ఆధ్యాత్మిక తిరుసభగా మారిపోతుంది. పౌలు ఈ యంశాన్ని గూర్చి యీలా చెప్పాడు. "అప్పడు అంతం వస్తుంది. క్రీస్తు పాలకులను అధికారులను శక్తులను అందరినీ జయించి రాజ్యాన్నితండ్రియైన దేవునికి అప్పగిస్తాడు” - 1కొ15,24. ఇక్కడ పౌలు పేర్కొన్న"రాజ్యం" తిరుసభే. లోకాంతంలో తండ్రి సమస్తాన్ని పరిపాలిస్తాడు-1కొ15,28. కనుక తిరుసభ ఆధ్యాత్మికంగా మారిపోయి కలకాలమూ తండ్రి ఆధీనంలో ఉండిపోతుంది.

4. క్రీస్తు రెండవమారు మహిమతో వేంచేసివచ్చి ఏంచేస్తాడు? అతడు మృతులమైయున్న మనలను జీవంతో లేపుతాడు. మనకు సాధారణ తీర్పు తీర్చి బహుమతినో లేక దండననో విధిస్తాడు. మనలనూ ఈ భౌతిక సృష్టినీ మహిమపరుస్తాడు. రెండవరాకడ అనేది లోకాంతంలో జరిగే అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమేకాదు. అతి ముఖ్యమైన సంఘటనం. దానితో పూర్వవేదకాలం నుండి వస్తూన్నప్రస్తుత రక్షణ చరిత్ర ముగుస్తుంది. ఈ లోకంలో భౌతిక తిరుసభ యాత్ర కూడ ముగుస్తుంది. క్రీస్తు తర్వాత నూత్న రక్షకుడెవడూ రాడు. తిరుసభ ప్రజలను రక్షించడమనేది కూడ ఉండదు. క్రీస్తు తన రాజ్యాన్ని పరిపూర్ణం చేసి తండ్రికి సమర్పిస్తాడు. ఆ దినం కొరకు మనమంతా భక్తిశ్రద్ధలతో వేచి ఉండాలి.

ప్రార్థనా భావాలు

1. క్రైస్తవులమైన మనం ప్రధానంగా నిరీక్షణతో జీవించేవాళ్ళం. మన ప్రభువైన క్రీస్తు మరణకాలంలోను లోకాంతంలోను గూడ వేంచేసి వస్తాడు. అతడు మనలను మహిమ పరుస్తాడు. ఈ లోకంలో మన మనుభవించే శ్రమలకూ పడే కష్టాలకూ విలువ ఉంటుంది. అసలు ఇప్పడు మనం పడే కష్టాలు తర్వాత మనకు ప్రత్యక్షమయ్యే మహిమతో ఎంతమాత్రం పోల్చదగినవికావు. అనగా ఇప్పటిశ్రమలకు అప్పడు నూరంతలు ఫలితం పొందుతాం - రోమా 8,18. కనుక మనం ఆ యంత్యదినంకోసం ఆతురతతో వేచివుండాలి.

2. క్రీస్తు సామెతల్లో కొన్ని మనం అతని రెండవ రాకడకొరకు కనిపెట్టుకొని ఉండాలని హెచ్చరిస్తున్నాయి. "యజమానుడు సాయంకాలమో అర్థరాత్రివేళలోనే కోడికూసే