పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జరుగుతుందో కొంతవరకైనా ముందుగానే తెలిసికోవచ్చు. కాని లోకాంతంలోని సాధారణపురాకడ ఎప్పడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. క్రీస్తు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "ఆ దినం ఎప్పడు వస్తుందో నా తండ్రికి మాత్రమే తెలుసు. కుమారునికి గాని పరలోకంలోని దూతలకుగాని మరెవ్వరికిగాని ఆ గడియ తెలియదు” అని వాకొన్నాడు - మత్త 24,36. కనుక ఆయంత్యదినాన్ని గూర్చి పుకార్లు పుట్టించడం వ్యర్ధప్రయాస మాత్రమే ఔతుంది.

2. ఈ లోకం ఏలా ముగుస్తుంది? క్రీస్తు రెండవమారు విజయం చేసినప్పడు ఈ భౌతికలోకం నాశమైపోతుందనీ, అది అగ్నివల్ల దగ్ధమై పోతుందనీ పూర్వవేదశాస్తులు భావించారు, దీనికి పేత్రు రెండవ జాబులోని వేదవాక్యాలను ఆధారంగా చూపించారు. "ప్రభుదినం దొంగలా వస్తుంది, ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశం అంతరిస్తుంది. గ్రహతారకాదులు దగ్ధమై నశిస్తాయి. సర్వవస్తు సంచయంతోపాటు భువి అదృశ్యమౌతుంది. నీతికి నిలయమైన క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానం చేస్తాడు" - 2 పేత్రు 3,1013. కాని ఈ వేదవాక్యాలు దర్శనాల భాషలో ఉన్నాయి. కనుక మనం వీటిని ఉన్నవాటిని ఉన్నట్లుగా గ్రహించనక్కరలేదు. ప్రభువు ఆకస్మాత్తుగా రెండవమారు వేంచేసి వస్తాడనే ఈ వాక్యాల భావం. అతడేలా వస్తాడు, అగ్నితో వస్తాడా అనే ప్రశ్నలకు ఈ వాక్యాలు జవాబు చెప్పవు,

నేటి వేదశాస్రులు ఈ యంశాన్ని గూర్చి ఈలా బోధిస్తున్నారు. క్రీస్తు రెండవరాకడతో ఈ ప్రస్తుత ప్రపంచమేమో ముగుస్తుంది. కాని అది అగ్నివలన కాలిపోదు. మార్పును మాత్రం చెందుతుంది. మన భౌతికదేహం ఆత్మవలన మార్పు చెందుతుంది, అలాగే క్రీస్తు రెండవరాకడ వలన ఈ భౌతిక ప్రపంచంకూడ మార్పు చెందుతుంది. కాని యిలా మారిన ప్రపంచం స్వరూపం ఏలా ఉంటుందో ఎవరికీ తెలియదు.

3. క్రీస్తు రెండవసారి వచ్చాక ప్రస్తుత తిరుసభ ఏమౌతుంది? బైబుల్లో దైవరాజ్యమనేది పెద్ద భావం. పరలోకంలోని మోక్షమూ భూలోకంలోని తిరుసభా కలసి దైవరాజ్యమౌతాయి. ఇక, క్రీస్తు రెండవరాకడతో భూలోకంలోని తిరుసభ ఏమౌతుంది? తిరుసభ అంటే క్రైస్తవులే. కనుక క్రీస్తు రెండవరాకడతో తిరుసభ తన భౌతిక జీవితాన్ని ముగించి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభిస్తుంది. లోకాంతం తర్వాత ప్రస్తుత తిరుసభ అనేది