పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాను మరణించిన వెంటనే ప్రభువు రెండవరాకడను దర్శించాడు. అలా దర్శించి ఉండకపోతే “నేడే నీవు నాతో కూడ పరలోకం ప్రవేశిస్తావు” అని క్రీస్తు అతనితో చెప్పిన మాటలకు అర్ధం లేదు-లూకా 23,43.

      పై వాక్యాలనుబట్టి లూకా రెండవరాకడ అనేది మన మరణకాలంలోనే జరుగుతుందని భావించాడు అనుకోవాలి, యోహానుకూడ ఈలాగే భావించాడు. అతని సువిశేషంలో క్రీస్తు తన శిష్యులతో "నా తండ్రి గృహంలో అనేక నివాసస్థలాలున్నాయి. నేను విూకు ఓ నివాసస్థలాన్ని సిద్ధం చేయడానికి పోతున్నాను. నేను వెళ్ళితే మికు ఓ నివాసస్థలాన్ని సిద్ధంచేసి మళ్ళా వస్తాను" అని చెప్పాడు - యోహా 14,1–4 ఈ వాక్యాల సందర్భాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. ప్రభువు తాను వెళ్ళిపోతానని చెప్పగా శిష్యులు కలవరపడ్డారు. వాళ్ళ విచారాన్ని తొలగించడానికి ప్రభువు పై వాక్యాలు చెప్పి వాళ్ళను ఓదార్చాడు - కనుక అతడు శీఘ్రమే తిరిగివచ్చి వాళ్ళను తనచెంతకు తీసికొనిపోవాలి. అప్పడుగాని వాళ్ళకు ఓదార్పు కలుగదు. అతడెప్పడో లోకాంతంలో వస్తే వాళ్ళకు ఓదార్పేమిూ కలుగదు. కనుక ఇక్కడ "నేను మళ్ళా తిరిగి వస్తాను మిమ్ము   నాచెంతకు తీసికొని పోతాను" అనే మాటలు వాళ్ళ జీవితకాలానికి వర్తించాలి. అందుచేత ఇక్కడ ప్రభువు మళ్లావచ్చే అతని ఉత్ధానం నుండి అపోస్తలుల మరణం వరకు ఉన్న కాలమైయుండాలి. పన్నెండుమంది శిష్యుల్లో ప్రతివాడూ తాను చనిపోయేపుడే ప్రభువు రెండవ రాకడను దర్శించిఉండాలి.
       ఈలా ఈ వేదవాక్యాలు మన మరణకాలంలోనే మనం ప్రభువు రెండవరాకడను చూస్తామని బోధిస్తున్నాయి. కాని ఈ వాక్యాలు లోకాంతంలో ప్రభువు వేంచేసి రాడని చెప్పవు. మనం మరణకాలంలో చూచే రెండవరాకడనే మళ్ళా లోకాంతంలో కూడ చూస్తాం అవి రెండు సంఘటనలు కావు, ఏకసంఘటనమే. రెండవరాకడ మన మరణకాలంలో ప్రారంభమై లోకాంతంవరకు కొనసాగుతుంది. మన వ్యక్తిగతమైన రెండవరాకడా,లోకాంతంలో జరిగే సాధారణ రాకడా ఒకదానితో ఒకటి కలసిపోతాయి.

2. రెండవరాకడకు సంబంధించిన కొన్ని అంశాలు

   1. ప్రభువు లోకాంతంలో ఎప్పడు వేంచేసి వస్తాడు? మన మరణం ఎప్పడు

వచ్చేదీ కొంతవరకైనా వూహించవచ్చు. కనుక మనకు వ్యక్తిగతమైన రెండవరాకడ ఎప్పడు