పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3. మన మరణ సమయంలోనే ప్రభుదర్శనం

పూర్వవేదశాస్త్రులు ప్రభువు లోకాంతంలో రెండవమారు వేంచేసివస్తాడని చెప్పారు. నూత్నవేదంలో కొన్నివాక్యాలు కూడ ఈ భావాన్ని సమర్ధిస్తున్నట్లు కన్పిస్తాయి. కాని నేటి వేదశాస్తులు మన మరణమే మనకు రెండవరాకడ ఔతుందని చెప్తున్నారు. ప్రభువు లోకాంతంలో వస్తే అప్పటికి బ్రతికివున్న కొద్దిమందికి మాత్రమే ఆరాకడ అర్థవంతంగా ఉంటుంది, అంతకుముందు చనిపోయిన అసంఖ్యాక ప్రజలకు ఆరాకడ ముఖ్యమైంది కాజాలదు. అది మన జీవితకాలంలో జరుగదు కనుక మన మెవ్వరమూ దాన్ని పట్టించుకోం.

అందుకే ఆధునిక వేదశాస్తులు రెండవరాకడ మన మరణకాలంలోనే జరుగుతుందని భావిస్తున్నారు. ఈలా భావిస్తే అది మనకు ముఖ్యమైన సంఘటనం అవుతుంది. మన మందరమూ మన మరణ సమయంలో ప్రభువుని కలుసుకోవాలని యెంచితే, ఆ గడియకోసం చిత్తశుద్ధితో వేచిఉంటాం. ప్రతివాడూ తన మరణానికీ, ఆ మరణంలో ప్రభువుని కలుసుకోవడానికీ జాగ్రత్తగా సంసిద్దుడౌతాడు. ఐనా మన మరణకాలమే మనకు రెండవరాకడ ఔతుంది అనేది కేవలం వేదశాస్త్రు అభిప్రాయం మాత్రమే. అది వేదసత్యంకాదు. తిరుసభ ప్రభువు మళ్ళా రెండవసారి వస్తాడని మాత్రమే చెప్తుంది. ఎప్పడు వస్తాడు, ఏలా వస్తాడు అనే విషయాలను గూర్చి అధికారపూర్వకంగా ఏమిూ చెప్పదు.

నూత్నవేదంలో కొన్నివాక్యాలు ప్రభువు లోకాంతంలో వస్తాడని చెప్తాయి. కాని అతడు మనమరణకాలంలోనే వస్తాడని సూచించే వాక్యాలుకూడ లేకపోలేదు. అలాంటివాటిని కొన్నిటిని పరిశీలిద్దాం. యూదుల సైఫనును రాళ్ళతో కొట్టి చంపగా అతడు పవిత్రాత్మతో నిండినవాడై పరలోకంవైపు చూచాడు. అతని దేవుని మహిమా, దేవునికి కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండడమూ కన్పించాయి. అతడు చూడండి! పరలోకం తెరవబడి ఉంది. మనుష్యకుమారుడు దేవుని కుడిప్రక్కన నిలబడి ఉన్నాడు" అని పల్మాడుఅచ 7,55-56. ఈ వాక్యాలనుబట్టి సైఫను లోకాంతంలో గాక, తాను మరణించిన వెంటనే ఉత్థానక్రీస్త్రుని దర్శించాడు అనుకోవాలి. అతడు ఇక్కడ దర్శించింది ప్రభువు రెందవరాకడనే. అది అతని మరణకాలంలోనే జరిగింది. ఈలాగే మంచిదొంగ కూడ