పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/312

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మబ్బులు కమ్మివన్నదినాన ఆకాశంలో సూర్యుడు కన్పించడు. కాని మనకంటికి కన్పించకపోయినా సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడనుకోవాలి. అలాగే క్రీస్తు నేడు మనకంటికి కన్పింపకపోయినా తిరుసభలో ఉన్నాడనుకోవాలి. ఇంకా సూర్యబింబం ఎక్కడినుండో ఆకాశంలోకి రాదు. అది నిరంతరమూ అక్కడే ఉంటుంది. అలాగే క్రీస్తు లోకాంతంలో ఎక్కడినుండో మనదగ్గరికి రాడు. అతడు నిరంతరమూ మన మధ్యలో, తిరుసభలోనే ఉంటూంటాడు.

మనం సూర్యుణ్ణి నేరుగా చూడలేం. చూస్తే మనకండ్ల మాడిపోతాయి. మేఘంమాటున ఉన్న సూర్యబింబాన్ని మాత్రమే మనం దర్శింపగలం. అలాగే మహా తేజోమూర్తియైన ఉత్తాన క్రీస్తుని మనం నేరుగా చూడలేం. ఈ జీవితంలో విశ్వాసపు తెరలు అడ్డంబెట్టుకొని మాత్రమే అతన్ని దర్శిస్తాం. లోకాంతంలో ఇక ఈ విశ్వాసంతో అవసరంలేదు. అప్పడతన్ని నేరుగా దర్శిస్తాం.

క్రీస్తు నేడు తిరుసభలో చాల రూపాల్లో ప్రత్యక్షమౌతూంటాడు. అతడు క్రైస్తవ సమాజంలో ఉంటాడు. కనుకనే ప్రభువు నా పేరుమీదిగా ఇద్దరు ముగ్గురు సమావేశమైనకాడ నేనూ ఉంటానని చెప్పాడు- మత్త 18,20.అతడు పేదసాదల్లోను ఆకలిదప్పు అనుభవించే వాళ్ళలోను ఉంటాడు. కనుకనే ఈనా సోదరుల్లో అత్యల్పడైన ఒకనికి మిరు చేసింది నాకు చేసినట్లే భావిస్తానని పల్మాడు - మత్త25,40. అతడు తన శిష్య సమూహంలో ఉంటాడు. కావననే లోకాంతంవరకు నేను విూతో ఉంటానని చెప్పాడు - మత్త28,20. అతడు జ్ఞానస్నానంపొందిన క్రైస్తవుల్లో ఉంటాడు. కావననే విశ్వాసంద్వారా క్రీస్తు మీ హృదయాల్లో వసిస్తుంటాడు అని పౌలు పేర్కొన్నాడు - ఎఫే 3,17. భక్తులు వేదగ్రంధాలు చదివేకాడ అతడే దివ్యగ్రంథ బోధను విన్పిస్తూంటాడు. అన్నిటికంటె అధికంగా అతడు దివ్యసత్రసాదంలో ఉంటాడు. ఈ సాన్నిధ్యాలేవి మనకంటికి కన్పించవు. ఐనా మనం విశ్వాసంతో ఈ సాన్నిధ్యాలను నమ్ముతుంటాం. ఐనా ఈ సాన్నిధ్యాలన్నీ తాత్కాలికమైనవే. కనుక ఇవన్నీ అంతరించిపోతాయి. అతడు చివరిసారిగా తిరుసభలోనుండి చూపించే సాన్నిధ్యం మహా తేజోవంతమైంది. విశ్వాసపు తెరలు అడ్డం పెట్టుకోకుండానే ఆ తేజోవంతమైన సాన్నిధ్యాన్ని మనం దర్శించవచ్చు. అదే రెండవ రాకడ.