పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు ఉత్థానం మన ఉత్థానానికి మాదిరిగాను కారణంగాను ఉంటుంది. క్రీస్తుని జీవంతో లేవనెత్తిన తండ్రి మనలను కూడ లేపుతాడు. క్రీస్తు లేచాడంటే మనమూ లేస్తామన్నమాటే - 1కొరి 15,12-13.

క్రీస్తుని కాని మనల్ని కాని జీవంతో లేపేది పవిత్రాత్మే తండ్రి ఏ యాత్మద్వారా క్రీస్తుని లేపాడో, ఆ యాత్మద్వారానే మనలనుకూడ లేపుతాడు-రోమా 8,11. మనం జ్ఞానస్నానంలోనే ఉత్తాన క్రీస్తు ఆత్మను పొందుతాం. అతనికి దేవాలయమౌతాం-1కొరి 6,19. తనకు దేవాలయమైన నరుడ్డి ఆ దివ్యాత్ముడు వట్టినే వదలివేయడు. మరణానంతరం అతన్ని తప్పకుండా లేపుతాడు.

మనం జ్ఞానస్నానం పొందినప్పటినుండి క్రీస్తు మరణికోత్తానాలు మనమిూద పనిచేయడం మొదలుపెడతాయి. అతడు భౌతికంగా మరణిస్తే మనం ఆధ్యాత్మికంగా, అనగా పాపజీవితానికి చనిపోతాం. అతడు భౌతికంగా ఉత్థానమైతే మనం ఆధ్యాత్మికంగా, అనగా పుణ్యజీవితానికి ఉత్తానమౌతాం. ఈ యాధ్యాత్మిక ఉత్థానం కడన మనకు శారీరకోత్తానాన్ని గూడ సంపాదించి పెడుతుంది- రోమి 64-5.

పౌలుకి క్రీస్తు తబోరు కొండమిూద పొందిన ప్రకాశమంటే చాల యిష్టం. అతడు తన జాబుల్లో చాలాసార్లు ఆ ప్రకాశాన్ని పేర్కొన్నాడు. అది మనకుగూడ లభిస్తుందని వాకొన్నాడు. ప్రభువు కొండమిూద రూపాంతరం చెందగా అతని ముఖం సూర్యుళ్ళా ప్రకాశించింది. అతని దుస్తులు వెలుగువలె తెల్లనయ్యాయి-మత్త 17,2. తండ్రి ఆనాడు క్రీస్తు ముఖంపై ప్రకాశింపజేసిన వెలుగుని ఈనాడు భక్తుల హృదయాల్లో గూడ ప్రకాశింపజేస్తాడు-2కొ46. పౌలుకి డమస్కత్రోవలో దర్శనమిచ్చింది తబోరు కొండమిది ప్రకాశం లాంటి ప్రకాశమే - అచ 9,3. బలహీనమైన మన యీ మర్త్యశరీరాన్ని ఉత్థానక్రీస్తు తన శరీరంలాగ ప్రకాశవంతమైన దాన్నిగా చేస్తాడు-ఫిలి 3,21,

మరణించిన వాళ్ళల్లో ప్రథమఫలమో అన్నట్లుగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు - 1కొరి 15,20. ఈ వాక్యం భావమిది. యూదుల దేవాలయంలో ప్రథమఫలాలు అర్పించేవాళ్లు. దీనిద్వారా పొలంలోని పంటంతా దేవునికే చెందిందని సూచించారు. అలాగే క్రీస్తు మృతులలో నుండి మొదటి ఫలమో అన్నట్లు లేచాడు. అతని ఉత్థానం చనిపోయిన వాళ్ళంతా ఉత్థానమౌతారని సూచిస్తుంది. అతడు మృతులలోనుండి