పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీదేహమైనా సరే, ఈ దేహాన్నెపుడూ కామభావాలతో చూడకూడదు. గౌరవమర్యాదలతో, భక్తి ప్రపత్తులతో చూస్తుండాలి. పౌలు బోధించినట్లుగా ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు. అనగా అశుద్ధ పాపాలతో ఈ దేహాన్ని అమంగళపరచుకోగూగదు - 1కొ 6,8.

ఉత్తాపితమాత మోక్షంలోవుండి మనలను మరచిపోదు. అక్కడనుండి మనకోసం మనవి చేస్తుంటుంది. మనలను కూడ తన చెంతకు పిల్చుకుంటుంది. మనమూ ఆ చోటునకు చేరాలని హెచ్చరిస్తుంటుంది. కావున మనం ఇచటనుండి చూపు మరల్చి అటువైపునకు చూస్తుండాలి. ఆ తల్లి చూపించే దివ్యధామంవైపు పయనం సాగిస్తుండాలి.

6. మరియరాజ్ఞి

ఏడవ శతాబ్దపు భక్తుడు ఇల్డెఫోన్సస్ మరియను గూర్చి చెపూ "నేను క్రీస్తుదాసుడ్డి గనుక మరియదాసుడ్డి మరియే దేవుని దాసురాలు కనుక నా రాబ్ది. నేను మరియ రాజ్ఞని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసికొంటాను" అని వ్రాసాడు. మరియ మన రాబ్ది, ఇక్కడ మూడంశాలు విచారిద్దాం.

1. మరియ రాజ్ఞి అంటే ఏమిటి?

మరియ పరలోక, భూలోకాలకు రాజ్ఞగా నియమింపబడింది. సృస్టి ప్రాణులందరికీ ఆమె రాజ్ఞి. “కృపారసము గల మాతయై యుండెడి రాజ్జీ వందనము" మొదలైన ప్రాచీన జపాలు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి. కనుక బహుప్రాచీన కాలం నుండే క్రైస్తవ ప్రజలు ఆమెను రాజ్ఞగా కొనియాడుతూ వచ్చారని విశదమౌతుంది.

మరియ రాజ్ఞత్వం మనలను పరిపాలించడం కోసంగాదు, మనకొరకు మనవిచేయడంకోసం. ఆ తల్లి నరులందరి కోసమూ క్రీస్తుని మనవి చేస్తుంది. అందరికీ వరప్రసాదాలు ఆర్థించి పెడుతుంది. ఆమె కోరికలనూ, మనవులనూ క్రీస్తు ఎప్పడూ కాదనడు. ఆ రాజ్ఞఓ చంద్రబింబం లాంటిది. వేడుదలరూపమైన ఆమె పాలనం మనందరికీ ఆపదం కలిగిస్తుంది.

2. కారణాలు

కాని మరియ ఎందుకు రాజ్ఞ యైనట్లు? క్రీస్తు రాజు. ఆ రాజు తల్లియైన మరియకూడ రాజ్ఞ దేవమాతగా ఆమె పొందిన అంతస్తే ఆమెకు ఉత్థాపనం సంపాదించి