పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నేను నిరంతరమూ నీ కంటిపెట్టుకొని వుంటాను

నీవు నా కుడిచేతిని పట్టుకొని నన్ను నడిపిస్తావు

నీ వుపదేశంతో నీవు నన్ను నడిపిస్తావు

కడన నిన్ను నీ మహిమలోనికి గొనిపోతావు

స్వర్గంలో నీవు తప్ప నా కింకెవరున్నారు?

ఈ భూమిమిూద నీవు తప్ప మరొకటి నాకు రుచించదు

నా దేహమూ నా హృదయమూ

ప్రేమవలన కృశించిపోతున్నాయి

దేవుడే సదా నా కాశ్రయం

అతడే నాకు వారసభూమి" - 73,23–26,

ఈ కీర్తనకారుని భావాల ప్రకారం, భగవంతుడు భక్తునికి ధర్మశాస్తోపదేశంచేస్తూ అతన్ని ఈ జీవితంగుండా నడిపించుకొని పోతాడు. ఈ జీవితయాత్ర ముగిసాక అతన్ని మోక్షమహిమలోనికి చేర్చుకొంటాడు. అక్కడ దేవుడు తప్ప అతనికి ఆనందాన్నొసగేదేమి ఉండదు. ఈ లోకంలో ప్రభువు మిది ప్రేమవలన అతని హృదయం కృశించిపోతూంది. అతడు మోక్షంలో ప్రభువుని దర్శించి రక్షణాన్నీ పరమానందాన్నీ పొందుతాడు. కావున స్వర్గంలోని ప్రభువుని చూడాలని అతనికి గాఢమైన కోర్కె

మోక్షాన్నీ దైవదర్శనాన్నీ గూర్చిన మహాభక్తుల కోరికలు ఈలా ఉంటాయి. మనం ఈలోక వస్తువ్యామోహాల్లో కూరుకొనిపోయి మోక్షాన్ని పట్టించుకోం. అలాంటప్పడు ఈ భక్తుల ప్రార్థనలు మనకు ప్రేరణం పట్టిస్తాయి. మన మనసులను ఈలోక వస్తువులనుండి పరలోక్త భాగ్యాలవైపు మరల్చుతాయి.

2. బైబులూ మోక్షవర్ణనమూ

బైబులు మోక్షాన్ని దైవదర్శనంగాను, దైవజ్యోతిగాను, దైవస్పర్శగాను వర్ణిస్తుంది. ఈ మూడంశాలను విపులంగా పరిశీలిద్దాం.

1. మోక్షం దైవదర్శనం

భక్తులు భగవంతుణ్ణి దర్శిస్తారని చెప్తుంది బైబులు, స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్టే మోషే ప్రభువుతో ముఖాముఖి మాట్లాడేవాడు - నిర్గ 33, 11. అతడు దేవుని రూపాన్ని చూచాడు - సంఖ్యా 12,8. ఈ మోషేలాగే కీర్తన కారుడుకూడ తాను దేవుడ్డి చూస్తానని నమ్మాడు. "నేను నిర్దోషిని గనుక నిన్ను దర్శిస్తాను, నేను మేల్కొనినప్పడు నీ-సాన్నిధ్యం వలన సంతృప్తి చెందుతాను" అని పల్కాడు – 17,15. ఈ వేదవాక్యాల్లో