పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన తరపున మనం సాధ్యమైనంతవరకు ఈ లోకంలోనే మన పాపావశేషాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటే పరలోకంలో ఉత్తరించే స్థలాన్ని చాలవరకు తప్పించుకోవచ్చు. దీనికిగాను మనం ఏమి చేయాలి? ప్రార్థనలు ఉపవాసాలు దానధర్మాలు మొదలైన పుణ్యకార్యాలు చేసి వాటిని మన పాపపరిహారానికి సమర్పించుకోవచ్చు. ఈ జీవితంలో మన పాలబడే శ్రమలనుగూడ మంచి ఉద్దేశంతో స్వీకరించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మన శ్రమలను క్రీస్తు శ్రమలతో చేర్చి పాపపరిహారంగా సమర్పించుకోవచ్చు. ఇంకా, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పూజబలిని గూడ అర్పించుకోవచ్చు. ఈలోకంలో కొద్దిపాటి బాధలతోనే మన అనిత్య శిక్షను తొలగించుకోవచ్చు. పరలోకంలో ఐతే ఫనోర బాధలతోగాని ఆ శిక్షను తొలగించుకోలేం. కనుక ఈ లోకంలో ఉండగానే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొందామనే కోరిక మనకు మిక్కుటంగా ఉండాలి. ఎప్పడుకూడ విశుద్ధ హృదయులేకాని దేవుణ్ణి దర్శించటానికి యోగ్యులుకారు. కనుక దూరదృష్టి కలిగి యిక్కడ ఉండగానే మన భవిష్యత్తుని మనం చక్కదిద్దుకొంటే బాగుపడతాం. బహుశా మనలో చాలామంది ఉత్తరించే స్థలంద్వారా గాని మోక్షాన్ని చేరుకోలేరు. ఈలోకంలో కఠోరమైన తపస్సు ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొన్న ఏకొద్దిమందో గాని నేరుగా మోక్షానికి పోరు.

5. మోక్షం

ముగ్గురు దైవవ్యక్తులను ముఖాముఖి దర్శించి ఆనందించడమే మోక్షం, మనకు మోక్షంమిూద మిక్కుటమైన కోర్కె ఉండాలి, మన యిల్ల అక్కడ. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం.

1. కీర్తనకారుల మోక్షవాంఛ

కీర్తనలు రచించిన భక్తులు మోక్షాన్నీ దైవదర్శనాన్నీ గాఢంగా వాంఛించారు ప్రస్తుతానికి వాళ్ళల్లో ముగ్గురు భక్తుల కోరికలను మాత్రం పరిశీలిద్దాం. "నేను నిరంతరమూ ప్రభువు సాన్నిధ్యం

కలిగించుకొంటాను

అతడు నాచెంతనే వుంటాడుకనుక నాకేభయము లేదు

నేనతనికి వందనాలర్పించి సంతోషిస్తుంటాను,

సురక్షితంగా వుండిపోతాను