పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెడ్డనుచేయాలని కోరుకోవడం, తన్నుతాను విపరీతంగా ప్రేమించుకోవడం మొదలైనవి ఈయవశేషాలు. ఈ యవశేషాలవల్లనే మనం అనిత్యశిక్షకు గురౌతాం, భూలోకంలో తపస్సు చేయడంద్వారా ఈ యనిత్యశిక్షను తొలగించుకోవచ్చు. అలా చేయనివాళ్లు పరలోకంలో దాన్ని తొలగించుకోవలసి ఉంటుంది. ఈలా తొలగించుకోడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం.

తెలుగులో "ఉత్తరించే స్థలం" అన్నమాట పూర్వవేదశాస్రులు కల్పించింది. దాటిపోయే తావు అని ఈమాటకర్థం. అనగా వరప్రసాద స్థితిలో చనిపోయినవాళ్ళు ఈ తావుగుండా మోక్షానికి దాటిపోతారు. మొదట ఇక్కడ శుద్ధిని పొంది తర్వాత మోక్షాన్ని చేరుకొంటారు. ఉత్తరించే స్థలంలో జరిగే ప్రధాన కార్యం ఆత్మ తన మాలిన్యం నుండి శుద్ధిని పొందడం. కనుక దాన్ని శుద్దీకరణ స్థలం అనిగానీ, ప్రాయశ్చిత్త స్థలం అనిగానీ పిలవడం ఉచితం.
మన మనుష్యభాషలో మోక్షనరకాలనూ ఉత్తరించే స్థలాన్నీ "స్థలాలు" అని పేర్కొంటాం. కాని ఇవి స్థలాలు కానేకావు. ఇవి మన ఆత్మకు పట్టే స్థితులు లేక దశలు. ఐనా సామాన్య ప్రజలకుగూడ అర్ధంకావడంకోసం వీటిని స్థలాలు అంటూంటాం.
మోక్షనరకాలు శాశ్వతంగా ఉంటాయి. ఉత్తరించే స్థలం శాశ్వతమైంది కాదు. దానికి కాలపరిమితి లేదు. అసలు మన కాలం దానికి వర్తించదు. మన భాషలో చెప్పాలంటే, ఉత్తరించే స్థలానికి వెళ్ళిన ఆత్మలు బహుశ అతిస్వల్పకాలం మాత్రమే అక్కడ వుంటాయి. పూర్వవేదశాస్తులు కొన్ని ఆత్మలు లోకాంతంవరకుగూడ ఆ తావులో ఉండిపోవచ్చునని భావించారు. ఇప్పటి వేదశాస్తులు ఈ భావాన్ని అంగీకరించరు. 

నరకంలో మన భౌతికమైన నిప్పు ఉండదని చెప్పాం. ఉత్తరించే స్థలంలోగూడ భౌతికమైన నిప్పు యేదీ ఉండదు. దేవుణ్ణి దర్శించలేకపోవడమే అక్కడి ఆత్మలు అనుభవించే ప్రధాన శిక్ష.

2. బైబులు బోధ

బైబులు ఉత్తరించే స్థలాన్ని గూర్చి ప్రత్యక్షంగా ఏమీ చెప్పదు. బైబులు మొత్తంలోను ఉత్తరించే స్థలాన్ని సమర్ధించే అలోకనం ఒక్కటే లభిస్తుంది, అదికూడ పరోక్షమైంది. యూదా మక్కబీయుడు అదుల్లాం నగరంలో యుద్ధం చేస్తూండగా అతని సైనికులు స్థానిక దేవతల బొమ్మలను తమ శరీరాలమీద తాయెతులుగా ధరించారు. ఈ కార్యంద్వారా వాళ్లు ధర్మశాస్త్రాన్ని విూరి పాపం కట్టుకొన్నారు. ఈ పాపానికి శిక్షగా వాళ్ల యుద్ధంలో కూలారు. యూదా రెండువేల వెండి నాణాలు యెరూషలేముకు పంపించి యుద్ధంలో దుర్మరణం చెందిన సైనికుల కొరకు పాపపరిహారబలిని అర్పింపజేసాడు-2