పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/282

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నరకంలోని వాళ్ళకు పూర్ణ స్వేచ్చ ఉంటుంది. ఐనా వాళ్ళ పశ్చాత్తాపపడరు, పడలేరుకూడ. పాపి తనపాపాలకు పశ్చాత్తాపపడాలంటే దేవుని వరప్రసాదం అవసరం. నరకంలోని పాపాత్ములకు ఈ వరప్రసాదం లభించదు.

భగవంతుడు అందరిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమవల్లనే అతడు అందరు నరుల్లోను తనపట్ల గాఢమైన ఆకర్షణను పెడతాడు. కనుకనే మనందరి హృదయాలు సహజంగానే భగవంతుణ్ణి కోరుకుంటాయి. పాపి ఈ కోరికను తాత్కాలికంగా అణచివేసికోగలడేగాని దాన్నిమాత్రం హృదయంలోనుండి నిర్మూలించలేడు. ఇక, నరకంలోని వాళ్ళకుకూడ భగవంతునిమిూద గాఢమైన కోరిక ఉంటుంది. వాళ్లు ఒకవైపున తమ స్వేచ్చను దుర్వినియోగం జేసికొని భగవంతుణ్ణి నిరాకరిస్తుంటారు. మరొకవైపున హృదయంలోని సహజవాంఛవలన అతనివైపు ఆకర్షితులౌతూంటారు. ఈ నిరాకరణ ఆకర్షణల మధ్య ఘోరమైన ఘర్షణ జరుగుతూంటుంది. ఇది మహాబాధ. నరకవాసులు దేవుణ్ణి ద్వేషిసూ ఉంటారు, అతన్ని వాంఛిసూ ఉంటారుకూడ. దేవునివైపు ఆకర్షితులౌతూంటారు, అతనినుండి వెనుకకు త్రోయబడుతూంటారుకూడ. దేవునివైపు తిరుగుతూంటారు, అతనినుండి మొగం త్రిప్పకొంటూంటారుకూడ. ఈ విపరీత చర్యలవల్ల వాళ్ళకు కలిగే బాధ అంతాయింతాకాదు, భగవంతునిపట్ల నరునికుండే సహజవాంఛ నరునిపట్ల భగవంతునికుండే ప్రేమకు నిదర్శనం. అలాంటి ప్రేమమయుడైన దేవుడు నరునికి నరకాన్ని విధించడు. కనుక నరకం దేవుడు చేసింది కాదు, అతడే స్వయంగా చేసికొనేది. దేవుడు నరునికి ద్రోహం చేయడు. నరుడే దేవునికి ద్రోహం చేస్తాడు.

౩. నరకం శాశ్వతమైంది

నరకం శాశ్వతంగా ఉండిపోతుంది. అనగా పాపి నిరంతరమూ నరకంలో ఉండిపోతాడు. అతడు పశ్చాత్తాపపబడి, పాపపరిహారంపొంది మళ్ళా దేవుని సన్నిధిలోకి రాలేడు. ఎందుకంటె మనం చనిపోయేప్పుడు ఏస్థితిలో ఉంటామో ఇక ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోతాం. చనిపోయాక మళ్ళా మనసు మార్చుకోవడమూ ఉండదు. కనుక నరకంలోని పాపులు ఏనాటికీ పశ్చాత్తాపపడరు. కనుకనే నరకం శాశ్వతమైందని చేప్తాం.

"శాశ్వతం" అనే పదమే మనకు భీతిని పుట్టిస్తుంది. నరకశిక్షకు ఏనాడూ అంతంలేదు. ఆ బాధ ఏనాడూ ముగియదు. ఈలోకంలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే నరకంలోనివాళ్ళు తమశిక్షను తప్పించుకొని వుండేవాళ్ళే వాళ్లు తమ అజాగ్రత్తవల్లా అహంకారంవల్లా ఆ దండనను చేతులార కొని తెచ్చుకొన్నారు. తాముదాన్ని తప్పించుకోగలిగి కూడ తప్పించుకోలేదు. కనుక తప్ప పూర్తిగా తమదేనని అంతరాత్మ