పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవకుణ్ణి వెలుపలి చీకటిలోనికి త్రోసివేసారు. అచటివాళ్లు ఏడుస్తూ పండ్లు కొరుకుకొంటారు -25,30, కడతీర్పు సామెతలో శాపగ్రస్తులను నిత్యాగ్నిలోనికి పంపారు. అది పిశాచమూ దాని దూతలూ ఉండేచోటు - 25,41. ప్రభువు పేరుమాత్రము వాడుకొంటూ అతని బోధలను పాటించకుండా ఉండేవాళ్ళతో అతడు దుష్టులారా! విూరు నానుండి తొలగిపొండి, నేను మిమును ఎరుగనే యెరగను అని చెప్తాడు–7,23. బహుశా అన్నికటింటె కరోరమైన వాక్యం మార్కు సువిశేషంలో వస్తుంది. ఇతరులను అపమార్గం పట్టించేవాళ్ళను నరకంలో త్రోస్తారు. అక్కడ వాళ్ళ పురుగు చాపదు, అగ్ని చల్లారదు - 9,48.

పైన మనం పేర్కొన్న వాక్యాలన్నిటినీ పరిశీలిస్తే నరక వర్ణనలోని ముఖ్యాంశాలు ఇవి, అది అగ్నిగుండం, చీకటి చెరసాల. అక్కడ పిశాచమూ దాని దూతలూ ఉంటారు. దానిలోనివాళ్లు దుఃఖంతో ఏడుస్తూ పండ్లు కొరుకుకొంటూ ఉంటారు. అక్కడివాళ్ళను ప్రభువు తన సన్నిధిలో నుండి బహిష్కరించాడు. అక్కడి నిపుఆరక మండే నిత్యాగ్ని అక్కడి వాళ్ళ పురుగు చావదు.

2. యోహాను, పౌలు భావాలు

యోహాను తొలి మూడు సువిశేషాల్లాగా వర్ణనలకు పూనుకోడు. కనుక అతడు నరకాగ్నిని గూర్చి చెప్పేప్పడు అగ్నిగుండం, పండ్లు కొరకడం మొదలైన ప్రయోగాలు అట్టేవాడడు. అతని దృష్టిలో నరకం మృత్యువూ, అంధకారమూ, క్రీస్తు జీవమూర్తి, మనకుకూడ జీవాన్ని ప్రసాదించేవాడు. అతన్ని నిరాకరించేవాళ్ళ మృత్యువుని చవిచూస్తారు. అదే నరకం, కుమారుని విశ్వసించేవాడు నిత్యజీవాన్ని పొందుతాడు. విశ్వసించనివాడు ఆ జీవాన్ని ఎంతమాత్రమూ పొందలేడు. దేవుని కోపం అతనిమిూద నిలుస్తుంది-3,36. యోహాను ఈమృత్యువుని "రెండవ మృత్యువు" అని కూడ పిల్చాడు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవో వాళ్ళనందరినీ అగ్నిగుండంలోకి త్రోస్తారు. ఈ యగ్నిగుండమే రెండవ మృత్యువు -దర్శ 20, 14 మొదటి మృత్యువు మన చావే. దీనివల్ల మనం భౌతిక జీవం కోల్పోతాం. రెండవ మృత్యువు నరకం. దీనివల్ల మనం ఆధ్యాత్మిక జీవం కోల్పోతాం. క్రీస్తు వెలుగు. ఆ వెలుగుని కోల్పోతే మనం చీకటికి జిక్కుతాం. ఆ చీకటే నరకం. "లోకానికి వెలుగుని నేనే. నన్ననుసరించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని పొందుతాడు" - 8,12 ఇక, పౌలు దృష్టిలో నరకం మరణం - రోమా 6,23. వినాశం-ఫిలి 3,19, \ దేవుని ఆగ్రహం -1తెస్స 1,9. 270