పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవర్తింపవలసిఉంటుంది! - దర్శ 20, 12. మనం ఇతరులకు ఏ కొలతన కొలుస్తామో దేవుడుకూడ మనకు అదే కొలతన కొలుస్తాడు అంటే మనం తోడిజనంతో ఎంత చిత్తశుద్ధితో మెలగవలసి ఉంటుంది! - మత్త 7,2. ఈ భావాలన్నీ మనకు ఆలోచన పుట్టించాలి. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చక్కదిద్దుకొని మంచికి మారడానికి ప్రేరణం పుట్టించాలి.

6. దేవుని తీర్పుకి తట్టుకోవడం ఏలా? ఏ ప్రభువు మనకు న్యాయాధిపతో అతడే మనకు ఆశాకిరణం గూడ. మనం దేవుని తీర్పుకి తట్టుకొని నిలబడాలంటే క్రీస్తుని విశ్వసించాలి. మరోమార్గంలేదు. క్రీస్తుని నమ్మినవాళ్ళకు దండనం లేదు -రోమా 8,1. ప్రభువుని నమ్మినవాడికి ఖండనం లేదు.అతడు మరణాన్ని తప్పించుకొని జీవాన్ని పొందుతాడు - యోహా 5,24. తండ్రిగాని క్రీస్తుగాని మనలను ఖండించరు. తండ్రి ప్రేమతో మన కొరకు క్రీస్తుని పంపినవాడు. క్రీస్తు మనకొరకు చనిపోయి, మనకు మధ్యవర్తియై నిరంతరమూ మన తరపున ప్రార్ధనం చేసేవాడు. అలాంటి తండ్రీకొడుకులు మనలను దండించడానికి తయారుగా వుండరు కదా! - రోమా 8,33–34. దేవుడు మనలను ప్రేమించేవాడు కనుక తీర్పుదినాన్ని గూర్చి భయపడక ధైర్యంగా ఉండవచ్చు - 1కోహా 4, 17. మనం చీకటికీ రాత్రికీ సంబంధించనవాళ్ళం కాదు. వెలుగుకీ పగటికీ సంబంధించినవాళ్ళం. కనుక తీర్పుదినం దొంగలావచ్చి మనలను నిశ్చేష్టులను చేయలేదు. ఎప్పడుగూడ ప్రభువు దండనం దుర్మార్డులకుగాని సజ్జనులకుగాదు - 1తెస్స 5,3-6.

కనుక ఓవైపు మనం దేవుని తీర్పుని జూచి భయపడాలి. వళ్లు దగ్గిర పెట్టుకొని జీవించాలి. కాని మరోవైపు క్రీస్తుని విశ్వసించాలి. అతనికి మనపట్లగల ప్రేమను జూచి నమ్మకం దెచ్చుకోవాలి. ఆ నమ్మకంద్వారానే ఆ న్యాయాధిపతి విధించే శిక్షవలని భయాన్ని తొలగించుకోవాలి.

4. ఆధునికుల భావాలు

పూర్వాధ్యాయంలో శాస్త్రజ్ఞలు ఇంచుమించు చనిపోయి మళ్లాబ్రతికి బయటపడ్డవాళ్ళ అనుభవాలను కొన్నింటిని పరిశీలించి చూచారని చెప్పాం. చనిపోయేవాళ్ళ జ్యోతిర్మూర్తిని కలసికొంటారనిగూడ చెప్పాం. ఈ చనిపోయేవాళ్ళ కథనం ప్రకారం, ఆ జ్యోతిర్మూర్తి మరణించేవాళ్ళకు వాళ్ళ జీవిత సంఘటలనన్నిటినీ దృశ్యాలుగా చూపిస్తాడు. ఈ దృశ్యాల్లో నరుల జీవితంలోని ప్రధాన సంఘటలన్నీ ఉంటాయి. అవి త్వరత్వరగా కదిలే సినిమా బొమ్మల్లాగ వాళ్ళ కన్నులయెదుట కన్పిస్తాయి. అలా త్వరగా కదిలినా మరణించేవాళ్లు వాటి భావాన్ని గ్రహించగలుగుతారు. అసలా బొమ్మలన్నీ వాళ్లకు ఏకకాలంలోనే కన్పిస్తాయి. ఏకకాలంలోనే వాటి అర్ధాన్ని గ్రహించే శక్తికూడ వాళ్ళకు 266