పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగుకంటె చీకటినే యెక్కువగా ప్రేమించారు". ఈ వాక్యాల్లో వెలుగంటే క్రీస్తే నరుల్లో కొందరు క్రీస్తుని అంగీకరిస్తారు, మరికొందరు అంగీకరించరు. ఆ ప్రభువుని విశ్వసించనివాళ్ళకు ఖండనం ఉంటుంది.

యోహాను భావాల ప్రకారం మనం తీర్పుకి లోకాంతందాకా వేచి ఉండనక్కరలేదు. మరణందాకా గూడ వేచి ఉండనక్కరలేదు. ఆ తీర్పు యిప్పడే, మనం జీవించి ఉండగానే జరిగిపోతుంది. క్రీస్తు వెలుగుగా మనకు తీర్పు విధిస్తాడు. అతన్ని అంగీకరించేవాళ్ళకు బహుమతీ, అంగీకరించనివాళ్ళకు శిక్షా ఉంటాయి. క్రీస్తుపట్ల మనకుండే అవిశ్వాసంగాని విశ్వాసంగాని యీ శిక్షా బహుమతులకు ఆధారం. ఇక్కడ క్రీస్తుని అంగీకరించడమూ విశ్వసించడమూ అంటే ఆ ప్రభువుని ప్రేమించి అతని ఆజ్ఞలను పాటించడం.

4. పైన మత్తయి, యోహాను, లూకా భావాలను చూచాం, ఇక మిగిలిన నూత్న వేద రచయితలు, అనగా పౌలు పేత్రు మొదలైనవాళ్ళు ప్రభువు రెండవమారు విజయంచేసినపుడు తీర్పు తీరుస్తాడని చెప్పారు. అనగా యిది లోకాంతంలో జరిగే సాధారణ తీర్పన్నమాట. లోకాంతంలో ప్రభువు స్వయంగా విచ్చేసి బ్రతికినవాళ్ళను చనిపోయినవాళ్ళనూగూడ తీర్పుకి పిలుస్తాడు - 1తెస్స 4,15-18. మనం ఇప్పడు క్రీస్తు శ్రమల్లో పాలుపొందితే అతడు మహిమతో వచ్చినపుడు ఆనందాన్ని పొందుతాం1 పేత్రు 4,14. భక్తులు ఓపికతోను ధైర్యంతోను ప్రభువు విచ్చేసే దినంకోసం వేచివుండాలి - యాకో 5,8. ప్రతివ్యక్తీ ఒక్కసారే మరణిస్తాడు. తదుపరి దేవుని నుండి తీర్పు పొందుతాడు - హెబ్రే 9,27.

5. విశ్వాసులకు దైవభీతి కలిగించడానికి దివ్యగ్రంథం తీర్పుని భయంకరమైన దాన్నిగాకూడ చిత్రిస్తుంది. దేవుడు పక్షపాతానికి లొంగకుండా ఎవరెవరి ప్రవర్తనను ಬಣ್ಣಿ వాళ్ళకు తీర్పు జెప్తాడు - 1షేత్రు 1,17. కాబట్టి నిస్పక్షపాతియైన ఆ న్యాయాధిపతిని జూచి మనం భయపడాలి. పూర్వవేదంలో మోషే ధర్మశాస్తాన్ని విూరినవాళ్ళకు, ఇద్దరు ముగ్గురు సాక్షుల నిదర్శనం లభిస్తే చాలు, మరణశిక్షపడేది, అలాంటప్పుడు నూతవేదంలో దేవుని పుత్రుట్టే నిరాకరించనవాళ్ళ గతి ఏమౌతుంది? నిబంధన రకాన్ని కాలదన్నిదేవుని ఆత్మనే అవమానపరచినవాళ్లు ఎంతటి ఫరోరశిక్షననుభవించరు? సజీవుడైన దేవుని చేతికి జిక్కడం మహాభయంకరంగదా? - హెబ్రే 10,27-31. ఆ దేవుడు మన రహస్యాలోచనలకుగూడ తీర్పు తీరుస్తాడు అంటే మనం ఎంతగా జాగ్రత్తపడవలసి ఉంటుంది! - రోమా 2,16. అతడు మనం పలికే ప్రతి వ్యర్థపు మాటకుగూడ లెక్క అడుగుతాడు అంటే మనం ఎంత మెలకువతో ఉండవలసి ఉంటుంది! - మత్తయి 12,36, మన మంచి పనులూ చెడ్డపనులూకూడ అతని గ్రంథంలో లిఖింపబడి ఉంటాయి అంటే, అతడు మన పాపపుణ్యాలను ఏమాత్రమూ మర్చిపోడు అంటే, మనం ఎంత నిర్మలంగా