పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాని శిక్షగాని దేహాత్మలు రెండిటికీ లభించాలి. కాని ప్రత్యేకతీర్పులో ఆత్మ మాత్రమే, శిక్షనో బహుమతినో పొందుతుంది. సాధారణ తీర్చులోగాని దేహంగూడ ఉత్తానమై శిక్షనో బహుమతినో పొందదు.

మూడవది, సామూహిక భావాన్ని తెలియజేయడం కోసం. మనమంతా క్రీస్తు జ్ఞాన శరీరానిమి. అతని అవయవాలమి, పరలోకరాజ్య సభ్యులం, కనుక కడ తీర్పులో పుణ్యాత్ములంతా కలసే క్రీస్తునుండి బహుమతిని పొందుతారు. పాపాత్ములంతా కలసే అతని జ్ఞాన శరీరంనుండి బహిష్కౄతులగుతారు. జ్ఞానశరీరంగా క్రీస్తుతో మనకున్న ఐక్యతనీ, ఆ జ్ఞానశరీర సభ్యులంగా మనలో మనకున్న ఐక్యతనీ కడతీర్పు స్పష్టం చేస్తుంది

ఇన్ని కారణాలవల్ల కడతీర్పు అవసరమైంది. ప్రత్యేకతీర్పు కేవలం వ్యక్తిగతమైంది. సాధారణ తీర్పు సామూహికమైంది. నేడు కొందరు వేదశాస్తులు రెండు తీర్పులు అక్కరలేదనీ, ఒక తీర్పుతోనే సరిపెట్టుకోవచ్చునని చెప్తున్నారు. ఆ వొక్క తీర్పునే రెండు దృక్పథాలనుండి పరిశీలించి చూడవచ్చునని వీళ్ళ సూచన. దీన్నే మరణ సమయంలో ప్రత్యేక తీర్పనీ, లోకాంతంలో సాధారణ తీర్పనీ పిలవవచ్చునని వీళ్ళ అభిప్రాయం. రెండవ తీర్పు మొదటి తీర్పుకి ఏమీ చేర్చదు. కనుక వీళ్లు ఈలా అభిప్రాయపడుతున్నారు. బైబులు రెండు తీర్పులనుగాక ఒక్క తీర్పునే పేర్కొంటుంది. ఈ విషయంకూడ తమ అభిప్రాయానికి బలం చేకూరుస్తుందని వీళ్ళవాదం. ఇక్కడ ఈవివాదంలోకి మనం ప్రవేశించనక్కరలేదు. శతాబ్దలపొడుగునా పెద్దపెద్ద వేదశాస్రులే తీర్పులు రెండా లేక వొకటా అని చర్చలుచేసి ఎటూ తేల్చలేకపోయారు. కనుక నేడు మనం తీర్పులు రెండా లేక వొకటా అని వాదిస్తూ కూర్చోవడంకంటె, వాటికి ఏలా సంసిద్ధం కావాలా అని ఆలోచించడం మేలు.

3. బైబులు భావాలు

నూత్నవేదం ప్రభువు మనకు తీర్పుతీరుస్తాడని స్పష్టంగా చెప్పంది. ఆ తీర్పు రెండుసార్లుగాక ఒకేసారి జరుగుతుందని చెప్తుంది. కాని ఆ తీర్పు ఎప్పడు జరుగుతుందో స్పష్టంగా చెప్పదు. మత్తయి భావాల ప్రకారం తీర్పు లోకాంతంలో జరుగుతుంది. లూకా భావాల ప్రకారం అది మనం మరణించిన వెంటనే జరుగుతుంది. యోహాను భావాల ప్రకారం అది మనం జీవిస్తూండగానే జరుగుతుంది. ఇక ఈ భావాలను క్రమం పరిశీలిద్దాం.

1. మత్తయి 23,31-46 వచనాల్లో కడతీర్పు సామెత వస్తుంది. తొలిరోజుల్లో క్రైస్తవలోకంలో సాధారణ తీర్పు బాగా ప్రచారంలోకి రావడానికి కారణం ఈ సామెతే "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చునప్పడు" అనే ప్రారంభ వాక్యాలనుబట్టి ఈ రచయిత తీర్పు లోకాంతంలో జరుగుతుందని భావించాడు అనుకోవాలి