పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.మనుష్యులు చెట్లవలెనుండి, నడచుచున్నట్లు నాకు కన్పించుచున్నారు అని క్రీస్తుతో చెప్పిన దెవరు?
3. నన్నుగూర్చి మీరేమనుకొనుచున్నారు అని క్రీస్తు శిష్యులను అడుగగా పేత్రు ఏమి జవాబు చెప్పెను?
4.క్రీస్తు "సైతానూ! ఛీ! పో!" అన్నది యెవరిని?
5. క్రీస్తు ఒక వర్గము వారిని తన యొద్దకు రానివ్వమన్నాడు. దైవరాజ్యము వారిదేనన్నాడు. వారు ఎవరు?
6.క్రీస్తు చూపునిచ్చిన యెరికో గ్రుడ్డివాని పేరేమి?
7. పరిసయులు చక్రవర్తికి పన్ను చెల్లించుట న్యాయమా కాదా అని అడిగినపుడు క్రీస్తు చెప్పిన సమాధానమేమి? 8.కడపటి భోజనము ముగిసిన తరువాత క్రీస్తు ఆవేదన చెందుచు ప్రార్థన చేసిన తాను ఏది?
9. “తండ్రీ! ఈ పాత్రమును నానుండి తొలగింపుము" - ఈ వాక్యములో "పాత్రము” అనగానేమి?
10.క్రీస్తు దేహమునుంచిన సమాధి ద్వారమునకు అడ్డముగా ఏమి దొర్లించిరి?

86. లూకా సువిశేషము 1-7

1.లూకా తన సువిశేషమును ఎవరి కొరకు వ్రాసెను?
2.క్రీస్తు జన్మించినపుడు రోమను చక్రవర్తి ఎవరు?
3. మరియు తాను కనిన క్రీస్తు శిశువును ఎచట పరుండ బెట్టెను?
4. క్రీస్తు పండ్రెండేండ్ల యిూడున ఏ పట్టణమును సందర్శించెను?
5. బాలయేసు దేవాలయమున ఎవరికి ప్రశ్నలు వేసెను?
6. స్నాపక యోహాను బోధ ప్రారంభించిన కాలమున రోమను చక్రవర్తి యెవరు?
7.క్రీస్తు విశ్రాంతి దినమున అలవాటు చొప్పన ఎచటికి వెళ్ళెడివాడు?
8. క్రీస్తునకు తన యింట గొప్ప విందు చేసిన శిష్యుడెవరు?
9.కఫర్నాములో రోమను శతాధిపతి యూదులకు ఏమి కట్టించెను?
10. జనులు ఒక యువకుని శవమును పాడె పై మోసికొని వచ్చుచు క్రీస్తుకి ఎదురుపడినది ఏ గ్రామమున?