పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33. మత్తయి సువిశేషము 26 - 28

1.క్రీస్తుని నిరాకరించుచు "ఆ మనుష్యుని నేను ఎరుగను" అని చెప్పిన దెవరు? 2. కోడికూసిన పిమ్మట పేత్రు వెలుపలికివెళ్ళి ఏమి చేసెను? 3. యూదా దేవళములో విసిరికొట్టిన వెండి నాణెములతో ప్రధానార్చకులు ఏమి చెసిరి? 4.క్రీస్తునకు తీర్పు చెప్పినపుడు పిలాతు చేతులు ఏల కడుగుకొనెను? 5. "ఏలీ ఏలీ లామా సబక్తాని" అనగా నేమి? 6. క్రీస్తు చనిపోవునపుడు మధ్యాహ్నము మూడుగంటల పాటు దేశమంతట ఏమి యసాధారణ దృశ్యము కన్పించెను? 7.క్రీస్తు చనిపోయిన పిమ్మట ఏమి చినిగెను? 8. క్రీస్తునిగూర్చి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పల్కిన దెవరు? 9.యేసు దేహమును ఇప్పింపమని పిలాతుని అడిగిన దెవరు? 10. ఉత్థాన క్రీస్తు శిష్యులకు చేసిన చివరి వాగ్దానమేమిటి?

34. మార్కు సువిశేషము 1 - 6

1.స్నాపక యోహాను ఏమి దుస్తులు ధరించెను? 2.క్రీస్తు యాకోబు యోహానులను పిల్చినపుడు వారు ఏమి చేయుచుండిరి? 3.నల్లురు పడకపై మోసికొనివచ్చిన పక్షవాత రోగిని క్రీస్తు చెంతకు ఎట్లు తీసికొని రాగల్గిరి? 4.క్రీస్తు సూక్తుల ప్రకారము, ప్రాతగుడ్డకు దేనిని మాసిక వేయరు? 5.క్రీస్తు యాకోబు యోహానులకు "బోయనెర్గెస్" అని పేరు పెట్టెను. ఆ మాటలకు అర్థమేమి? 6.గెరాసీను మండలములోని దయ్యములు క్రీస్తు అనుమతిపై వేనిలో ప్రవేశించెను? 7. "తలితా కుమీ" అనగా నేమి? 8. నీవు స్నాపక యోహాను తలను కోరమని ఎవరు ఎవరికి చెప్పిరి? 9. యేసు ఎన్ని రొట్టెలతోను ఎన్నిచేపలతోను ఐదువేల మందికి ఆహారము పెట్టెను? 10. ఆ యాహారమును జనసమూహము దేనిపై కూర్చుండి భుజించెను?

35. మార్కు సువిశేషము 7–16

1.క్రీస్తు శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారని తప్పపట్టిన దెవరు?