పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31. మత్తయి సువిశేషము 8 -17

1.నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని యేసుకి మనవి చేసిన దెవరు?
2.యిస్రాయేలు ప్రజలలోను నేను ఇట్టి విశ్వాసము చూడలేదు అని ప్రభువు ఎవరిని గూర్చి పలికెను?
3. భారముచే అలసి సొలసియున్నవారికి ప్రభువు ఏమి దయచేయును?
4.శిష్యులు పంట పొలములో వెన్నులు త్రుంచి తిన్నది ఏ దినమున?
5. విత్తవాని ఉపమానమును చెప్పినపుడు క్రీస్తు ఎక్కడ ఉండెను?
6.దాచబడిన ధనము ఆణిముత్యము అనునవి దేనికి ఉపమానములు?
7. నీటిపై నడచుచు క్రీస్తు దగ్గరికి రాగోరినది ఎవరు?
8.తబోరు కొండపై క్రీస్తుతో మాటలాడిన ఇద్దరు పూర్వవేద భక్తులు ఎవరు?
9.ఆ కొండపై క్రీస్తుతోనున్న ముగ్గురు శిష్యులు ఎవరు?
10. క్రీస్తు పేత్రు ఇద్దరు దేవాలయపు పన్నుచెల్లించుటకు కావలసిన నాణెము వారికి ఎచట దొరికెను?

32. మత్తయి సువిశేషము 18–26

1.క్రీస్తు బోధల ప్రకారము మనము తోడివారిని ఎన్నిసార్లు క్షమింపవలెను?
2. తన యిద్దరు కుమారులకు ఉపకారము చేయమని క్రీస్తుని అడిగిన తల్లి యెవరు?
3. క్రీస్తు బోధల ప్రకారము, ధర్మశాస్త్రములోని రెండు ప్రధానాజ్ఞలు ఏవి?
4. ఇది రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడును అని ప్రభువు దేనినిగూర్చి పలికెను?
5. అవివేకవతులైన కన్నెలు తమ కాగడాలతోపాటు దేనిని తీసికొని పోలేదు?
6. ముగ్గురు సేవకుల సామెతలో మూడవవాడు తాను తీసికొన్న సొమ్మను ఏమి చేసెను?
7. ప్రభువు ఎవరికి చేసినది తనకు చేసినట్లుగా భావించును?
8. "ఈ సువార్త ఎచట బోధించబడునో అచట ఈమె చేసిన కార్యము ప్రశంసింపబడును" — ఆమె చేసిన కార్యము ఏమిటి?
9. క్రీస్తు తన మరణమునకు ముందు శిష్యులతో ఏ పండుగను జరుపగోరెను?
10.గెత్సెమని తోపులో యూదులు క్రీస్తుని బంధించుటకు యూదా ఏమి గురుతు నిచ్చెను?