పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.మరియు యోసేపు బాలయేసులకు దీనిలో తావు లభింపలేదు.
4.సిలోయములో ఇది కూలినపుడు 18 మంది మరణించిరి.
5.అవివేకియైన ధనికుడు వీనిని పడగొట్టించి ఇంకను పెద్దవిగా కట్టింపగోరెను.
6.ప్రభువు నజరెత్తూరు వెళ్ళినపుడు ఈ భవనములో వేద గ్రంథము చదివి బోధచేసెను.
7.దీనిని కట్టింపగోరువాడు ముందుగా దీనికగు వ్యయమును గూర్చి ఆలోచింపవలెను.
8.ప్రభువు మత్తయిని ఇచటినుండి పిలిచెను.
9.బుద్ధిహీనుడు దీనిని ఇసుక పునాదిమీద నిర్మించెను.
10.క్రీస్తు పరిసయులను ఈ కట్టడములతో పోల్చెను.

15. బైబులు ఆహారాలు

ఈ క్రింది ఆహారములు ఏవో తెలియజేయుడు.
1.ఉత్థాన క్రీస్తు శిష్యులయెదుట ఈ యాహారమును భుజించెను.
2.బలాఢ్యుడైన నరుడొకడు చనిపోయిన సింహము కళేబరమునందు ఈ యూహారమును కనుగొనెను. 3.ప్రతిదినము కాకులు ఏలియాకు ఈ యాహారమును కొనివచ్చెడివి.
4.ఫరో వంటవాడు తాను వీనిని గంపలో మోసికొని పోవుచున్నట్లు కలగనెను.
5.అబ్రాహాము తన్ను దర్శింప వచ్చిన దేవదూతలకు ఈ పానీయము నిచ్చెను.
6.ఏపావు ఈ యాహారము కొరకు తన జ్యేష్టభాగమును యాకోబునకు అమ్మివేసెను?
7.దీని మాంసమును వేటాడి తెచ్చుటకు ఈసాకు ఏసావును అడవికి పంపెను.
8.కనాను దేశమును వేగుజూడ బోయినవారు ఈ పండ్ల గుత్తిని కర్ర మీద మోసికొనివచ్చిరి.
9.దేవుడు యిప్రాయేలీయులకు ఎడారిలో ఈ పక్షులను ఆహారముగా నొసగెను.
10.యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలు దేరకముందు దీని మాంసమును భుజించిరి.

16. బైబులు వృత్తులు

1.జల ప్రళయానంతరము నోవా చేపట్టిన వృత్తి ఏది?
2.ఏసావు చేపట్టిన వృత్తి ఏది?
3.యోసేపు సోదరుల వృత్తి యేది?
4.ఫరోరాజు యిప్రాయేలీయులచే ఏమిపని చేయించెను?