పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకూ తల్లి ఔతుంది. అందుకే ప్రభువు కల్వరిమీద శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అని వక్కాణించాడు - యోహా 19,27. ఇక్కడ యీ శిష్యుడు క్రీస్తును నమ్మే శిష్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక ఆమె మనకందరికీ తల్లిగా ఈయబడింది. ఆ తల్లి క్రీస్తును గర్భంలో ధరించినపడే మనలనుకూడ తన ఉదరంలో మోసింది. శిరస్సు అవయవాలతో గూడిన పూర్తి క్రీస్తునకు ఆమె జనని. ఇక్కడ ఒక్కటే భేదం, ఆమె క్రీస్తుకు భౌతికంగా జనని. మనకు మాత్రం జ్ఞానరీత్యా తల్లి, అనగా మనం జ్ఞానస్వానం ద్వారా క్రీస్తుతో ఐక్యం గావడంవలన ఆమె మనకు తల్లి ఔతుంది.

ప్రాచీన క్రైస్తవ రచయితలు మరియమాతను తొలి తల్లి ఏవతో పోల్చారు. ఏవ దుష్టదూత మాటవిని తినవద్దన్న పండు తిని అవిధేయత చూపింది. రెండవ యేవయైన మరియు దేవదూత మాటవిని విధేయత చూపింది. ఆమె చెడ్డదూత మాటవిని మోసపోయింది. ఈమె మంచిదూత పలుకు ఆలించి, ఆ చెడ్డదూతను ఓడించింది. ఆ తొలితల్లి తన తెలివితక్కువతనంవల్ల మనకు చావుతెచ్చిపెట్టింది. మన మెడకు ఉరిపెట్టి పోయింది. కావున ఆమె మృతులమాత, కాని యీ రెండవతల్లి తన వివేకంవల్ల మనకు జీవం సంపాదించి పెట్టింది. మన మెడకు తగులుకొనిన ఉరిని తొలగించింది. కావున ఈమె జీవవంతులమాత, ఆ తల్లికంటె యీ తల్లి యోగ్యురాలు. ఆ తల్లి పాపానికి ఈ తల్లి ప్రాయశ్చిత్తం కూడ చేసింది. ఆ తల్లి తరపున ఈ తల్లి ప్రభువునకు విన్నపం చేసింది.

3. మాతృత్వపు మహిమలు

మరియు దేవుని తల్లి అన్నాం. దేవమాత గావడమంటే సామాన్య భాగ్యంకాదు. సృష్టి ప్రాణికి ఇక యింతకంటె గొప్ప భాగ్యమూ, మహిమా లేనేలేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియ. ఆమెకు దేవునికంటె తక్కువ స్థానం. కాని పునీతులకంటె దేవదూతలకంటెకూడ యొక్కువ స్థానం. అనగా దేవునికి చాలా దగ్గరస్థానం. ఆ కుమారుడెంత యోగ్యుడో ఆ తల్లీ అంత యోగ్యురాలు. అందుకే దేవమాత ప్రార్థనలోని బిరుదులన్నిటికంటె “సర్వేశ్వరునిమాత" అనేది చాల గొప్పబిరుదం. ఈ భాగ్యం వలననే సమస్త జాతిజనులూ ఆమెను ధన్యురాలని మెచ్చుకుంటారు - లూకా 1, 48. ఈ భాగ్యం దేవుడే ఆమెకిచ్చిన వరం. కాని ఈ వరంతో ఆమె సహకరించింది. దేవుని పూర్ణహృదయంతో ప్రేమిస్తూ, దివ్య మాతృత్వానికి తన్నుతాను తయారుచేసుకుంది. భక్తుడు అగస్టీనునుడివినట్లు "మరియ దేవుని గర్భంలో ధరించకముందే హృదయంలో ధరించింది." అనగా ఆమె భగవద్దృదయ, సద్భగవద్భక్తురాలు,

                                                                 13