పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేషిత సేవలో మొదట దేవుని ప్రజల అక్కరలు తీర్చాలి. ఆ పిమ్మట మన అక్కరలు తీర్చుకోవాలి. మొదట దైవసేవ, అటుపిమ్మట మన అక్కరలూ సుఖాలూ మొదలైనవి. భక్తిలేని గురువు మఠకన్య ఉపదేశి మొదలైన దైవసేవకులు మొదట తమ అవసరాలను తీర్చుకొంటారు. దేవుని ప్రజలను పట్టించుకోరు. కాని భక్తిగల దైవసేవకులు ఆ సారెఫతు విధవలాగే మొదట విశ్వాసుల అవసరాలను తీరుస్తారు.

12. కర్మెలు కొండమీద ఏలీయా 1 రాజు 18

1. సందర్భం

కర్మెలు కొండమీద యావేకి బాలుకీ పోటీ జరిగింది. ఆ పోటీలో యావే గెల్చి బాలు ఓడిపోయాడు. ఏలీయా సమరియా దేశంలో యావేమతాన్ని పునరుద్ధరించాడు. యిస్రాయేలీయులను మళ్ళా ప్రభువు దగ్గరకి రాబట్టాడు. భగవంతునిపట్ల భక్తి ఆసక్తి వున్న నాయకులందరికీ అతడు ప్రేరణంగా వుంటాడు.

2. వివరణం

మూడేండ్లపాటు ఉత్తర రాష్ట్రమైన సమరియాలో కరువు వికటాట్టహాసం చేసింది. ఆమీదట ప్రభువు క్షమాన్ని తొలగించాలనుకొన్నాడు. తన ప్రవక్తను అహాబు రాజు దగ్గరికి పంపాడు. దారిలో ప్రవక్త అహాబు ముఖ్యమంత్రియైన ఓబద్యాను కలసికొన్నాడు. ఇతడు యావేభక్తుడు, యెసెబెలు బారినుండి యావే ప్రవక్తలను కాపాడినవాడు. అప్పడు ఓబద్యా దేశంలోని వాగుల్లోను చెలమల్లోను ఏపాటి నీరు మిగిలివుందా అని పరిశీలించి చూస్తున్నాడు. నీరు చాలినంత లేకపోతే కొన్ని పశువులను చంపవలసి వుంటుంది.

ప్రవక్త ఓబద్యాను రాజుకి తన సమాచారం తెలియజేయమన్నాడు. మంత్రి దడిసాడు. ఎందుకంటే ఏలీయా ఒక్కతావలో వుండడు. ప్రభువు ఆత్మ అతన్ని చోటునుండి చోటుకి త్రిప్పతూంటుంది. ఏలీయా పలానాచోట వున్నాడని ఓబద్యా రాజుకి చెస్తే, కడన అతడు ఆ తావులో కన్పించకపోతే రాజు కోపంతో ఓబద్యానే చంపివేయవచ్చు. ఆ రాజు ఏలీయాకోసం అంతటా వెతికిస్తున్నాడు, దేశం మీదికి అనావృష్టిని తీసుకొచ్చింది ప్రవక్షే కనుక అతన్ని పట్టుకొని చంపించాలని ప్రయత్నం చేస్తూన్నాడు.

కడన రాజు ఏలీయాను కలసికొన్నాడు. ఈ దేశానికి నీపీడ పట్టింది అని అతడు ప్రవక్తను నిందించాడు.అనగా ఏలీయా బాలు దేవతను అవమానించాడు కనుక