పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కథ ఈలా వుండగా ఇంకో సంఘటనం జరిగింది. వితంతువు ఏకైక కుమారుడు జబ్బుపడి చనిపోయాడు. ఆమె ప్రవక్తను నిషురాలాడింది. అయ్యా! నీవు దైవభక్తుడివి కదా! నీవు నా రహస్యపాపాలను నీ దేవునికి తెలియజేసావు. అతడు నాపై కోపించి నా కుమారుడ్డి చంపివేసాడు చూడు అంది. ప్రవక్త బాలుని మృతదేహాన్ని తన గదిలోనికి తీసికొనిపోయాడు. ఆ శవంపై బోరగిలపడి తన శ్వాసను దానిలోనికి వూదాడు. ఆ బాలుని బ్రతికించమని దేవునికి మనవిచేసాడు. ప్రవక్తవాక్కు శక్తిమంతమైనది కదా! దేవుడు అతని మొరవిని చనిపోయిన బిడ్డట్టిబ్రతికించాడు. అతడు ప్రాణాలు తీసేవాడూ తిరిగి యిచ్చేవాడూకూడ. నూతవేదంలో పౌలుకూడ ఇదే పద్ధతిలో త్రోయపట్టణంలో ఐతుకు అనే యువకుణ్ణి బ్రతికించాడని చదువుతున్నాం - అ,చ,20,9-10.

వితంతువు చనిపోయిన బిడ్డడు మళ్ళా బ్రతకడం జూచి పరమానందం చెందింది. ఆమె ప్రవక్త వాక్కులోని శక్తిని గుర్తించింది. అతడు కొలిచే యావే ప్రభువుని విశ్వసించింది.

3. ప్రార్ధనా భావాలు

1. ప్రభువు తన భక్తులందరినీ ఆహారంతో పోషిస్తాడు. అతడు ప్రాణిపోషకుడు. ఆకాశపక్షులను పోషించే ప్రభువు తనకు పోలికగావుండే నరులకు తిండి పెట్టడా? కనుక మనం ఆందోళనం చెందకూడదు - మత్త 6,25-26.

2. రాజులు మొదలైన చారిత్రక గ్రంథాలను వ్రాసిన హీబ్రూరచయితలకు ప్రవక్తల వాక్కులంటే పరమగౌరవం. ఈ యధ్యాయం ఏలీయా వాక్కులోని శక్తిని మూడు పర్యాయాలు పేర్కొంటుంది. అతని మాటపై దేశంలో వాన కురవడం ఆగిపోయింది-1. అతని వాక్కవితంతువు కుటుంబానికి ఆహారం చేకూర్చి పెట్టింది -14, అతని పలుకు పోయిన పిల్లవాడి ప్రాణాన్ని మళ్ళా తీసుకువచ్చింది-22. ఈ ప్రవక్తల వాక్కులనే యిప్పడు బైబుల్లో మన కొరకు పదిలపరచి వుంచారు. కనుక మనం వాటిని భక్తిభావంతో చదువుకోవాలి.

3. సీదోను వితంతువు విశ్వాసం మెచ్చుకోదగింది. ఆమె ప్రవక్త వాక్యాన్ని నమ్మి మొదట అతనికి రొట్టెజేసి పెట్టింది. తత్ఫలితంగా ఆమెకు రోజురోజు రొట్టె లభించింది. దైవభక్తునిపట్లగల నమ్మకంద్వారా ఆమె ఆహారం సంపాదించుకొంది. క్రీస్తుకూడ ఆమె విశ్వాసాన్ని పొగడాడు-లూకా 4,25. ఈమెలాగే మనంకూడ విశ్వాసాన్ని పెంచుకోవాలి.

4. ఆ వితంతువు మొదట ప్రవక్తకు భోజనం పెట్టింది. తర్వాత తాను తింది. దైవభక్తునిపట్ల ఆమె చూపిన శ్రద్దా గౌరవమూ ఆలాంటివి. మనంకూడ మన