పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెహబాము సన్నిహితులు అతనికి దుష్టసలహా చెప్పారు. దానివలన అతడు యిస్రాయేలు పెద్దలపట్ల మూర్ధంగా ప్రవర్తించి రాజ్యవిభజనకు కారకుడయ్యాడు. మనం ఎవరికీ దుష్టాలోచనలు కలిగించకూడదు. ఇతరులు మనకు దుష్టాలోచనలు పట్టిస్తే వాటి ప్రకారం నడవకూడదు. మనం ఇచ్చే సలహాకాని, పొందే సలహాకాని దేవుడు ఆమోదిస్తాడా అని పరిశీలించి చూచుకోవాలి. భక్తులు ఇతరులకు మంచి సలహాలనిచ్చి లోకానికి ఎంతో మేలు చేసారు, దుషులు దుష్ట సలహాలనిచ్చి ఎంతో కీడుకూడ చేసారు.

సొలోమోను మహాజ్ఞాని. ఐనా అతడు విగ్రహారాధనకు పాల్పడి యిస్రాయేలు రాజ్యానికి వినాశం తెచ్చిపెట్టాడు. అతడు మోషే ధర్మశాస్రాన్ని మీరి అన్యజాతుల ఆడపడుచులను వివాహం చేసికొన్నాడు. వారి దైవాలను తానూ ఆరాధించి పాపం కట్టుకొన్నాడు – 11.2-4 అతనిపై కోపించి ప్రభువు రాజ్యాన్ని విభజించాడు. నేడు మనం విగ్రహాలను కొలవకపోయినా లోకవస్తు వ్యామోహాల్లో పడిపోతుంటాం. ధనం, పదవులు, పేరుప్రతిష్టలు మొదలైన వాటిని ఆర్ధించటానికి నానా గడ్డీ తింటాం. ఈ వ్యామోహాలు మనలను నాశంజేస్తాయి. సృష్టి వ్యామోహాల్లో జిక్కి సృష్టికర్తను విస్మరించకుండా వుండేవాడు ధన్యుడు.

ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించారన్నాం. ఆహీయా తన అంగీని ముక్కలుగాచించి యిప్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా చీలిపోతుందని చెప్పాడు. ఈ పద్ధతి నూతవేదంలోకూడ కన్పిస్తుంది. క్రీస్తు అంజూరాన్ని శపించడం నటనాత్మకమైన బోధ -మత్త21, 19. ఈ యంజూరం యిస్రాయేలు నాయకులకు గుర్తు. క్రీస్తు బోధలను నిరాకరిస్తే వాళ్ళు ఆ చెట్టులా ఎండిపోతారని భావం, అగబు ప్రవక్త పౌలు నడికట్టతో తన కాలు సేతులు బంధించుకోవడం నటనాత్మకమైన బోద - అ, చ.21, 10-11. ఇక్కడ యూదులు పౌలుని బంధించి రోమీయులకు అప్పగిస్తారని భావం, పూర్వవేద ప్రవక్తలు మన నూతవేదపు అర్యశిపుల్లాంటివాళ్ళ భగవంతుణ్ణి బాగా అనుభవానికి తెచ్చుకొన్న భక్తులు, రాజుల గ్రంథాలు మాటిమాటికీ ప్రవక్తలను పేర్కొంటాయి.ప్రభువు వారిద్వారా మాటలాడతాడని చెప్తాయి. బైబుల్లోని వారి బోధలను చదువుకొని నేడు మనంకూడ ప్రేరణం పొందాలి.