పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సొలోమోను విగ్రహారాధకుడైనా అతని తండ్రి గొప్ప దైవభక్తుడు. ఏకైక హృదయంతో, అనన్యచిత్తంతో యావేను కొల్చినవాడు. కనుక ప్రభువు తనకు దావీదుపై గల ఆదరభావంచే రాజ్యవిభజనాన్నిసొలోమోను కాలంలో జరిగించనన్నాడు. ఆ కార్యం సొలోమోను కుమారుడైన రెహబాము కాలంలో జరుగుతుందని చెప్పాడు. యరోబాము సాలోమోనుమీద చిన్న తిరుగుబాటు చేసాడు. ఆ రాజు అతన్ని చంపజూచాడు. కాని అతడు ఈజిప్టుకి పారిపోయి షీషకు ఫరో మరుగుజొచ్చాడు. సొలోమోను చనిపోయేవరకు అక్కడే వున్నాడు. ఈ షీషకు రెహబాము కాలంలో యూదామీదికి దండెత్తివచ్చి అతన్ని కొల్లగొట్టాడు. కాని సేవకుడైన యరోబాము ఏలా రాజయ్యాడు? సాలోమోను చనిపోగా అతని కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. అతని పట్టాభిషేకం షెకెము పుణ్యక్షేత్రంలో జరిగింది. సొలోమోను చనిపోయాడని తెలిసి యరోబాము యూదాకు తిరిగివచ్చాడు. అక్కడ రెహబాము పట్టాభిషేకానికి వచ్చిన యిప్రాయేలు పెద్దలందరు అతనితో అయ్యా! మీ నాయన పెద్ద భవనాలు కడుతూ మాచేత వెట్టిచాకిరి చేయించుకొన్నాడు. మామీద పెద్ద పన్నులు విధించాడు. ఈ భారాన్నిమేమిక మోయలేం. నీవైనా ఈ బరువుని తగ్గించవా అని అడిగారు. రెహబాము తన తండ్రికి సేవలు చేసిన వృద్దులను పిలిపించి ప్రజలు నన్నీలా అడుగుతున్నారు. నేను వారికేమి సమాధానం చెప్పాలి అని ప్రశ్నించాడు. ఆ వృద్దులు నీవు ఈ పెద్దలకు ప్రీతి కలగేలా మాటలాడు. వాళ్ళ జీవితాంతం నీకు లొంగివుంటారు అని చెప్పారు.

కాని రెహబాము ఆ వృదుల సలహాను పాటించలేదు. తనతో పెరిగిన యువకులను ఆలోచనం అడిగాడు. వాళ్ళు దుష్టాలోచనం చెప్పారు. ఆ దుష్టసలహా ప్రకారం అతడు యిస్రాయేలు పెద్దలతో పరుషంగా మాటలాడాడు. నేను మా తండ్రి మీపై మోపిన భారాన్ని ఇంకా రెండంతలు చేస్తాను. అతడు మిమ్మ శిక్షించినదానికంటె నేను రెండంతలు అదనంగా శిక్షిస్తాను అన్నాడు.
ప్రభువు తన భక్తుడైన అహీయా ప్రవక్తద్వారా సెలవిచ్చినట్లే యరోబామును రాజును చేయగోరి రెహబాముకి ఈ దుర్బుద్ధి పుట్టించాడు-12, 14
రాజు ఈలా మూర్ధంగా మాట్లాడితే ప్రజానాయకులు సహిస్తారా? వాళ్ళ రోషం తెచ్చుకొని రెహబాముమీద తిరుగుబాటు చేసారు. తమలో తాము మనమిక దావీదు వంశజులతో కలసి వుండవద్దు. మనదారి మనం చూచుకొందాం అనుకొన్నారు. కనుక ఉత్తరానవున్నపది తెగల యిస్రాయేలీయులు యూదా బెన్యామీను గోత్రాలనుండి విడిపోయి