పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుడు ప్రార్థనలుగానే భావిస్తాడు. పూర్వం మన ప్రాంతంలో వేదబోధ చేసిన విదేశ గురువులకూ మఠకన్యలకూ ఎన్ని భక్తిగల కోరికలుండేవో! ఆనాటి వాళ్ళకోరికల ఫలితంగానే ఇప్పడు మనం క్రైస్తవులమయ్యాం. ప్రభువు నేడు మనకుగూడ భక్తిగల కోరికలు పుట్టించాలని అడుగుకొందాం.

3. ఈ యధ్యాయంలో దావీదు వ్యక్తిగతంగాను యిప్రాయేలు సమాజం తరపునాను సమర్పించిన కృతజ్ఞతా ప్రార్ధనం చాల భక్తిమంతమైంది. అతన్నిచూచి మనంకూడ భక్తితో కృతజ్ఞతా ప్రార్ధనం చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రభువు కరుణవల్ల మనకు విద్య వుద్యోగం పరపతి కుటుంబం పిల్లాజల్లా ఇలబ్లావాకిలీ ఆరోగ్యం శాంతి మొదలైన నానా భాగ్యాలు సిద్ధించాయి. క్రైస్తవ విశ్వాసం, తిరుసభ దేవద్రవ్యానుమానాలు బైబులు గ్రంథం మరియమాత మొదలైన ఆధ్యాత్మిక వరాలు ఎన్నో లభించాయి. వీటన్నిటికి గాను మనం ప్రభువుకి వందనాలు చెప్పకోవద్దా?

4. దావీదు ప్రభువుకి దేవాలయం కట్టాలనుకొన్నాడు. తాను వసించే మేడకంటె పెద్దభవనం నిర్మించాలనుకొన్నాడు. అతని దేవాలయభక్తి అపారమైంది. తర్వాత సాలోమోను దేవాలయం కట్టించాడు. అది ఆనాటి గొప్ప భవనాల్లో రూపొందింది. యూదులు సంవత్సరం పొడవునా ఈ దేవళానికి యాత్రచేస్తుండేవాళ్ల దానిపట్ల అపారమైన భక్తి చూపేవాళ్ళు. నేడు మన గ్రామంలో, విచారణలో వుండే దేవాలయంపట్ల మనకు నిజమైన భక్తి వుండాలి. ప్రార్ధనకూ పూజకూ మనం ఆ మందిరానికి వెళ్తూండాలి. దాన్నిచూచి గర్వించాలి. కాని మన దేవాలయ భక్తి ఏపాటిది?

8. దావీదు పాపం

2సమూ 11,2-12,14

1. సందర్భం

దావీదు యిప్రాయేలు రాజులందరిలోను గొప్పవాడు. ప్రభువుకి అమితంగా ప్రీతి కలిగించినవాడు. అలాంటివాడే ఫ్రీ వ్యామోహానికి లొంగి పాపంలో పడిపోయాడు. దీన్నిబట్టి మన బలహీనతలను మనం ఏనాడూ విస్మరించకూడదని అర్ధం జేసికోవాలి. హీబ్రూ రచయితలు దావీదుని ఉత్తమ రాజునిగా చిత్రించారు. ఐనా వాళ్ళు అతని బలహీనతను కప్పిపెట్టలేదు. వారిలాగే మనంకూడ సత్యప్రీతిని అలవర్చుకోవాలి.