పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుద్ధం జరిగింది. ఉభయ సైన్యాలు ఆవైపు కొండపైనీ ఈవైపు కొండపైనీ బారులు తీర్చాయి. మధ్యలో లోయ వుంది.

యిస్రాయేలీయుల రాజు సౌలు. ఫిలిస్టీయుల నాయకుడు గొల్యాతు. ఈ గొల్యాతు తొమ్మిడగుల ఎత్తునవండి రాక్షసుళ్ళాగ కన్పించేవాడు. అతని తలకు కంచుటోపీవుంది. రొమ్ముకు కవచంవుంది. కాళ్ళకు పదతాణాలు వున్నాయి. భుజంమీద యూటె, చేతిలో బాకూ వున్నాయి, ఓ బంటు డాలు మోస్తూ అతనికి ముందుగా నడుస్తూంటాడు.

గొల్యాతుకి వొళ్ళంతా ఆచ్చాదనముంది. నొసటిమీద మాత్రం ఏమీలేదు. కనుక నొసటిమీద కొడితేనేగాని వాడు చావడు.

గొల్యాతు ముందుకివచ్చి యిస్రాయేలు సైన్యం నుండి ఎవరైనా ఒక వీరుడు వచ్చి తనతో పోరాడవచ్చునని సవాలు చేసాడు. యిస్రాయేలీయుల వీరుడు గెలిస్తే ఫిలిస్త్రీయులంతా యిస్రాయేలీయులకు బానిసలౌతారనీ, తాను గెలిస్తే యిప్రాయేలీయులంతా ఫిలీస్టయులకు బానిసలౌతారనీ పందెం వేసాడు. ఉభయ పక్షాల సైనికులు యుద్ధం చేస్తే చాలమంది చస్తారు. ఈ పద్ధతిలో ఐతే ఎవడో ఒక్క వీరుడు మాత్రమే చనిపోతాడు. అధిక ప్రాణనష్టం జరుగదు. కనుక ఉభయ పక్షాలు ఇద్దరు వీరులు మాత్రమే పోరాడే పద్ధతిని అంగీకరించాయి. కాని ఫిలిస్టియునితో పోరాడగల మెనగాడెవడు యిస్రాయేలీయుల పక్షాన కన్పించలేదు. వాళ్ళంతా గొల్యాతుని చూచి భయపడ్డారు.

అప్పడు దావీదనే బాలుడు సౌలు దగ్గరికివచ్చి రాజా! మనవారి పక్షాన నేను గొల్యాతుతో పోరాడగలను మీరేమీ భయపడనక్కరలేదు అన్నాడు. సౌలు దావీదుతో నాయనా! నీవు ఏనాడు యుద్ధంలో పాల్గొనని బాలుడివి. అతడు చాల యుద్దాల్లో పోరాడి ప్రావీణ్యం గడించిన మహావీరుడు. నీవు అతనితో ఏలా పోరాడతావు అన్నాడు.

దావీదు రాజా! నేను సైనికులతో పోరాడని మాట నిజమే. కాని వన్యమృగాలతో పోరాడి అనుభవం గడించాను. మాతండ్రి గొర్రెలుకాసూ చాలసార్లు సింహాలతో ఎలుగుబంట్లతో పోరాడి వాటిని మట్టపెట్టాను. వన్యమృగాల వాడి గోళ్ళనుండి నన్ను రక్షించిన దేవుడు సున్నతి సంస్కారంలేని ఈ ఫిలిస్టీయుని బారినుండి తప్పక కాపాడతాడు. సజీవుడూ శక్తిమంతుడూ ఐన ప్రభువు సైన్యాలను సవాలు చేయడానికి వీడు ఏపాటివాడు అన్నాడు.

ఆ మాటలాలించి సౌలు యిస్రాయేలీయుల తరపున గొల్యాతుతో పోరాద్దానికి దావీదుకి అనుమతి నిచ్చాడు. ఆ రాజు దావీదుచేత తన ఆయుధాలను ధరింపజేసాడు. కాని దావీదు గొర్రెలు కాచుకొనే బాలుడు. ఆయుధాలకు అలవాటు పడినవాడు కాడు. కనుక అతడు వాటితో నడవలేకపోయాడు. పైగా గొల్యాతు ఈ ఆయుధాలవల్ల చావడు. అందుచే దావీదు వాటిని తొలగించివేసాడు.