పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేనప్పడు అతడు తండ్రి స్థానాన్ని పొంది తమ్ముళ్ళను ఆజ్ఞాపిస్తాడు. కనుక దేవుడు పెద్దకొడుకైన యెలీయాబునే రాజుగా ఎన్నుకొనివుండాలనుకొని సమూవేలు అతనికి అభిషేకం చేయబోయాడు. కాని దేవుడు సమూవేలుని వారించి నరులైతే వెలుపలి రూపాన్ని జూచి మురిసిపోతారు. నేనైతే హృదయాన్ని పరిశీలిస్తాము. ఈ యెలీయాబు నాకు నచ్చలేదని చెప్పాడు. తర్వాత ఇతర కుమారులైన అబీనాదాబు, షమ్మా మొదలైనవాళ్ళంతా పుట్టుక క్రమంలో సమూవేలు దగ్గరికి వచ్చారు. కాని ప్రభువు వాళ్ళనెవరినీ ఎన్నుకోకపోవడంచే సమూవేలు వారికి అభిషేకం చేయలేదు.

ప్రవక్తకు అనుమానం కలిగింది. ప్రభువు ఈ యేడురు కొడుకుల్లో ఎవరినీ ఎన్నుకోలేదు. కనుక యీషాయికి ఇంకా కొడుకులు వుండివుండాలి. అందుచే ప్రవక్త నీ కుమారులంతా వీళ్లేనా అని అడిగాడు. తండ్రి అయ్యా! కడగొట్టవాడు ఇంకొకడున్నాడు. వాడు ఇంటిపట్టునలేడు. పొలంలో గొర్రెలు మేపుకొంటున్నాడు అని చెప్పాడు. ప్రవక్త అతన్ని శీఘ్రమే పిలిపింపమని తండ్రిని ఆదేశించాడు. తండ్రి పిలుపుపై దావీదు పొలంనుండి ఇంటికి వచ్చాడు.

దావీదు చూడ్డానికి ఆకర్షణీయంగా వున్నాడు. అతడు రాగానే ప్రభువు సమూవేలుతో నేను కోరుకొన్నవాడు ఇతడే అని చెప్పాడు. కనుకనే సమూవేలు విందు సమయంలో అన్నల యెదుట దావీదుకు ఏకాంతంగా అభిషేకం చేసాడు. అనగా పొట్టేలు కొమ్మకివున్న బిరడాను తొలగించి దానిలోని ఓలివచమురుని దావీదు తలపై కుమ్మరించాడు. యిస్రాయేలు ప్రజల రాజులకీ యాజకులకీ తైలాభిషేకం చేసేవాళ్ళ దీనివల్ల అభిషిక్తునికి దైవశక్తి లభించేది. ఇక్కడ ఈ యభిషేకం ద్వారానే దావీదు రెండవ రాజయ్యాడు. వెంటనే దేవుని ఆత్మ దావీదు మీదికి దిగివచ్చింది. ఈ యాత్మ యుద్దాత్మ ఆ రోజుల్లో యిస్రాయేలుకు ప్రబల శత్రువులు ఫిలిస్టీయులు.యిస్రాయేలు రాజు వారితో యుద్ధాలు చేయాలి. కనుక ఈ యాత్మ దావీదుకి యుద్దాల్లో నేర్పు ధైర్యసాహసాలూ దయచేసింది.

ఈ యభిషేకం సమూవేలు దావీదుకి బెల్లెహేమున రహస్యంగా చేసింది. దీన్ని గూర్చి ఇతరుల కెవరికీ తెలియదు. తార్వత యూదీయులూ యిస్రాయేలీయులూకూడ దావీదుకి హెబ్రోనున బహిరంగంగా అభిషేకం చేస్తారు - 2సమూ 2,4, 5,3, ఈ యభిషేకాలన్నీ ముగిసాక, సౌలు గిల్బోవా యుద్ధంలో చనిపోయాక, ఇంకా చాలయేండ్ల తర్వాతగాని దావీదు రాజ్యపాలనానికి పూనుకోలేదు.


{{center

3. ప్రార్ధనా భావాలు

}}

1. ప్రభువు ఎన్నిక ఆశ్చర్యకరంగా వుంటుంది. అతడు ఏడుగురు అన్నలను కాదని దావీదునే ఎన్నుకొన్నాడు. ప్రవక్త వచ్చినప్పడు దావీదు ఇంటిపట్టునగూడ లేడు. కనుక అతనికి రాజయ్యే అవకాశం చాల తక్కువ. ఎలీయూబుకి ఈ యవకాశమెక్కువ. కాని దైవనిర్ణయం తప్పతుందా? ప్రభువు కయీనుని కాదని హేబెలనీ, ఏసావుని కాదని యాకోబునీ ఎన్నుకొన్నాడు. అతడు తన కిష్టమొచ్చిన