పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. దావీదుకు అభిషేకం

                                              1సమూ 16,1=18
                                               1. సందర్భం
సౌలు అవిధేయుడై దేవుని ఆజ్ఞ మీరాడు. కనుక దేవుడు అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. అతనికి బదులుగా దావీదుని రెండవరాజుగా ఎన్నుకొన్నాడు. నేను ఈషాయి

కొడుకుల్లో ఒకడ్డి రాజుగా ఎన్నుకున్నాను, నీవు వెళ్ళి అతనికి అభిషేకంచేయి అని సమూవేలు ప్రవక్తను బేల్లెహేముకి పంపాడు.

                                             2. వివరణం

సౌలు అంటే సమూవేలుకి ఇష్టం. అతడు రాజపదవిని కోల్పోవడంజూచి సమూవేలు బాధపడ్డాడు. పైగా సమూవేలు రెండవరాజుకి అభిషేకం చేయబోతున్నాడని తెలిస్తే సౌలు ఊరకుంటాడా? కనుక సమూవేలు భయపడ్డాడు.

ప్రభువు సౌలుకి ఉపాయం చెప్పాడు. నీవు ఓ ఆవు పెయ్యను తోలుకొనిపో, బలిని అర్పించేవాడిలగ బెత్లెహేo వెళ్ళు. విందు సందర్భంలో నేనెన్నుకొన్నవాణ్ణి రాజుగా అభిషేకించు. సౌలుగాని మరెవ్వరుగాని ఈ రహస్యాన్ని తెలిసికోలేరు అని చెప్పాడు.

యీషాయికి ఎన్మిదిమంది కొడుకులు. దేవుడు వాళ్ళల్లో ఎవడ్డి రాజుగా ఎన్నుకొన్నాడో ప్రవక్తకు తెలియదు. అతడు దేవుని ఆజ్ఞప్రకారం తైలప కొమ్మను తీసికొని ఆవుపెయ్యను తోలుకొని బేల్లెహేముకి వచ్చాడు.

సమూవేలుని చూడగానే ఆ వూరి పెద్దలకు భయం వేసింది, అతని వాక్కు దీవెననూ శాపాన్ని గూడ తెచ్చిపెడుతుంది. ఇప్పడు అతడు బెత్లెహేము వాసులను దీవించడానికి వచ్చాడా లేక శపించడానికి వచ్చాడా? పైగా అతడు రాజులను చేసేవాడు, రాజులను కూలద్రోసేవాడు. అతని వల్ల ఈ గ్రామానికి ఏమి కీడు రానున్నదో!

సమూవేలు పురజనులకు భయపడవద్దని చెప్పాడు. మీరందరూ స్నానంచేసి శుద్ధిని పొంది బలికిరండని వారిని ఆహ్వానించాడు. యీషాయినీ అతని కుమారులనూ స్నానంతో శుద్ధిచేయించి ఆవుపెయ్యను బలియిూయడానికి పూనుకొన్నాడు.

రెండవరాజును అభిషేకించే సమయం వచ్చింది. యిూషాయికి ఎన్మిదిమంది కొడుకులు, వారిలో ఎవరిని రాజుగా అభిషేకించాలా అని సమూవేలు ఆలోచిస్తున్నాడు.

పెద్దకొడుకు ఎలీయాబు. అతడు రూపసి. పొడుగరి. సౌలుకీ అతనికీ ఆకారంలో పోలికలున్నాయి. పైగా యూదుల సంప్రదాయం ప్రకారం, ఇంటిలో పెద్ద కొడుక్కికొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. తండ్రి ఆస్తిలో అతనికి రెండువంతులు వస్తుంది. తండ్రి ఇంటివద్ద