పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ఇది చాల మంచిక. కథ జరిగిన స్థలం దేవాలయం. సమయం ప్రశాంతమైన వేకువవేళ. నిశ్శబ్ద వాతావరణం. దైవసందేశాన్ని విన్నది నిర్మల మనస్ముడైన పసిబాలుడు. మాట్లాడినది ప్రభువు. ఈలా కథంతా పవిత్రమైన వాతావరణంలో జరిగిపోయింది. కనుక మనం ఈ సంఘటనను బైబులునుండి పదేపదే చదువుకొని పవిత్రమైన దేవుని సందేశాన్ని వినడానికి సిద్ధంకావాలి. ప్రభువు దివ్యవాణి ఆనాడు సమూవేలుని వలె నేడు మనలనుగూడ ప్రభావితులను జేస్తుంది.

                                    4. ప్రభువు సౌలుని నిరాకరించడం 
                                              - 1సమూ 15
                                              1. సందర్భం
ప్రభువు సౌలుని మొదటి రాజుని చేసాడు. కొంతకాలమయ్యాక సౌలుకి పొగరెక్కి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుడు అతని రాజపదవినుండి త్రోసివేసాడు. అవిధేయత పెద్ద పాపమని సౌలుకథ తెలియజేస్తుంది.
                                               2. వివరణం

సమూవేలు సాలు దగ్గరికి వచ్చి "పూర్వం నేనే నిన్ను రాజునిగా అభిషేకించానుకదా! కనుక నీవు నా పలుకులు ఆలించు. అమాలెకీయులను సర్వనాశం చేయమని ప్రభువు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు వాళ్ళను శాపంపాలుచేయాలి" అని చెప్పాడు. శాపం పాలుచేయడమంటే యుద్ధంలో గెల్చినవాళ్ళు ఓడిపోయినవాళ్ళను స్త్రీలు పిల్లలతోసహా వధించడం. వారి పశువులను ఆస్తులను నాశంచేయడం. ఇది క్రూరకార్యం కాదా? ప్రాచీనకాలంలో కనాను దేశానికి చుట్టుపట్ల వసించే జాతులన్నీ యుద్ధంలో ఓడిపోయిన తమ శత్రువులను శాపంపాలుచేసి నాశం చేసేవి. కనుక ఇక్కడ యావే ప్రభువుకూడ ఈ పద్ధతినే అనుసరించాడు.

అమాలెకీయులు యిస్రాయేలీయులకు పూర్వం శత్రువులు. యూదులు ఐగుప్తనుండి తరలివచ్చేపుడు ఈ ప్రజలు వారికి కీడు చేసారు. కనుక ప్రభువు వాళ్ళను నాశం చేయగోరాడు - ద్వితీ 25, 17-19. సౌలు ఈ కార్యాన్ని నెరవేర్చడానికి అంగీకరించాడు.

ఆ రోజుల్లో కేనీయులనే మరోజాతివాళ్ళుకూడ అమాలెకీయులతో కలసి జీవిస్తుండేవాళ్ళు ఈ కేనీయులు యిప్రాయేలీయులకు మిత్రులు. కనుక సౌలు మొదట వాళ్ళను అమాలెకీయులనుండి విడదీసి ప్రక్కకు పంపాడు. ఆ రీతిగా వాళ్ళు చావుని తప్పించుకొన్నారు.