పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాశంచేయబోతున్నాడు. ఇక ఏలాంటి బిలులర్పించినా అవి ఏలీ కుటంబపు పాపాలకు ప్రాయాశ్చిత్తం చేయలేవు.

ఉదయాన్నే సమూవేలు కోవెల తలుపులు తీసి దేవాలయం మధ్యభాగంలోకి వచ్చాడు. అక్కడ యేలీ అతన్నికలసికొని బాబూ! దేవుడు నీకు ఏమి సందేశం చెప్పాడో తెలియజేయమన్నాడు. సమూవేలు మొదట దడిసాడు. కాని యేలీ ఒట్టపెట్టుకొని అడిగినందున దేవుడు తనకు వివరించిన ఉదంతమంతా తెలియజేసాడు. ఏలీ వినయంతో దేవుని చిత్తానికి లొంగాడు, నాయనా! నీతో మాట్లాడింది ప్రభువే. అంతా ఆయన సంకల్పించుకొన్నట్లే జరుగుతుంది. ప్రభువుకి అడ్డురావడానికి నేనెవడ్డి అన్నాడు.

పై దర్శనంలో ప్రభువు సమూవేలుని గూర్చి యేమీ చెప్పలేదు. ఐనా ఆ దర్శనంలోనే అతడు దేవుని ప్రవక్త అయ్యాడు. ఇక దేవుడు అతనిద్వారా మాటలాడ్డం మొదలెట్టాడు. కనుక సమూవేలు పలికిన పలుకులన్నీ నెరవేరాయి. కావున ఉత్తరాదినుండి దక్షిణాది వరకు గల యిస్రాయేలు ప్రజలంతా సమూవేలు దేవుని ప్రవక్త అయ్యాడని గ్రహించారు. అటుతరువాత ప్రభువు షిలో దేవళంలో సమూవేలుకి చాలసార్లు దర్శనమిచ్చాడు. చాలసారులు అతనికి తన సందేశాన్ని విన్పించాడు. ఆ సందేశాన్ని సమూవేలు ప్రజలకు తెలియజేస్తుంటేవాడు. ఈ విధంగా ఏలీ కాలంలో ప్రజలతో మాటలాడ్డం మానివేసిన ప్రభువు, ఇప్పడు సమూవేలు ద్వారా మళ్ళా మాటలాడ్డం మొదలెట్టాడు. అతని ద్వారా యావే దివ్యవాణి దేశంలో పుష్కలంగా విన్పించింది.

ఆ రోజుల్లోయిస్రాయేలీయులకు ప్రబల శత్రువులు ఫిలిస్ట్రీయులు. వారికీ వీరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏలీ కుటుంబమంతా నాశమైంది. ఏలీకి బదులు సమూవేలేషిలో దేవళంలో యాజకుడయ్యాడు. అతడు యాజకుడు, ప్రవక్త.  న్యాయాధిపతి, యుద్ధవీరుడు. యిప్రాయేలీయులను చాల యేండ్లపాటు దైవమార్గంలో నడిపించిన మహాభక్తుడు. 

యిస్రాయేలు దేశంలో మొదట రాజపదవిని నెలకొల్పినవాడు సమూవేలే. అతడు మొదట సౌలుని రాజుగా అభిషేకించాడు. ఆ రాజు దేవుని మాట వినక భ్రష్టుడైపోతే సమూవేలు దావీదుని రెండవరాజుగా అభిషేకించాడు. తన తల్లి అన్నా కోరుకొన్నట్లే అతడు ఆమరణాంతం దేవుని సేవకుడుగానే జీవించాడు - 1సమూ 1,11. పూర్వవేదంలోని మహాభక్తుల్లో సమూవేలు ఒకడు,

                                               3. ప్రార్థనా భావాలు
1.  సమూవేలు ఆలించిన మొదటి దైవోక్తి ఏలీ కుటుంబం వినాశాన్ని గూర్చి ఏలీ పాప కుటుంబం యుద్ధంలో నాశమైంది. తర్వాత ఏలీకి బదులుగా సమూవేలే దేవళంలో యాజకుడయ్యాడు. అపవిత్రుడైన గురువుకి బదులుగా పవిత్రుడైన శిష్యుడు వచ్చాడు. 
                                                        149