పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోవాలనుకొన్నారు. ఐదుగురు కలసి 56వేల వెండికాసులు లంచంగా యిచ్చారు, ఆరోజుల్లో అది చాల పెద్ద సొమ్ము.

డెలీలా సంసోనుని మభ్యపెట్టి అతని విచిత్ర బలానికి కారణమేమిటని అడిగింది. అతడు పచ్చిపచ్చిగావున్న అల్లెత్రాళ్ళతో నన్ను కట్టివేస్తే నా బలంపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాని సంసోను ఆ యల్లెత్రాళ్లను నిప్పంటుకొనిన నారత్రాళ్ళనులాగ త్రెంచివేసాడు. డెలీలా నవ్వలపాలయింది.
ఆమె మళ్ళా నీబల రహస్యమేమిటో చెప్పమని సంసోనుని నిర్బంధం చేసింది. అతడు క్రొత్తతాళ్ళతో కడితే నా బలం పోతుందని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాని సంసోను ఆ త్రాళ్లు దారాల్లాగ బ్రెంచివేసాడు. డెలీలాకు రెండవసారి ఆశాభంగం కలిగింది.
ఆమె మళ్ళా నీ యద్భుత శక్తికి కారణమేమిటో చెప్పమని అతన్ని పీడించింది. అతడు నాయేడు జడలను పడుగులాగ నేసి మేకుకి అంటగడితే నాబలం పోతుందని చెప్పాడు. డెలీలా అలాగే చేసింది, కాని అతడు తలతో ఒక్క వూపు వూపగా మేకు వూడివచ్చింది. జడలుకూడ విడిపోయాయి. ఈలా సంసోను మూడుసార్లు డెలీలాను ఆటలు పట్టించాడు.
కాని డెలీలా సంసోనుని వదలిపెట్టలేదు. నీ బలరహస్యాన్ని తెలియజేస్తేనేకాని నీకు నాపట్ల ప్రేమవుందని రుజువుకాదు అని అతనిని తొందరపెట్టింది. సంసోను డెలీలా పోరు పడలేక విసిగిపోయి చివరికి తన బలరహస్యాన్ని చెప్పివేసాడు. నేను చిన్నప్పటినుండి నాజరేయ వ్రతాన్ని చేపట్టి నా తలజట్టు కత్తిరించుకోకుండా జీవించాను. ఈ జట్టుని కత్తిరిస్తే నా బలం పోతుంది అని తన మర్మాన్ని తెలియజేసాడు

యథార్థంగా సంసోను బలం అతని జట్టులో లేదు. అతడు చేపట్టిన నాజరేయ వ్రతంలో వుంది. ఈ ప్రతాన్ని పూనినవాళ్ళు మద్యం సేవించరు. తలజట్టు కత్తిరించుకోరు. దైవసేవలో కాలం గడుపుతారు. నూత్నవేదంలో స్నాపక యోహాను ఈలాంటివాడే. ఇక్కడ సంసోను తన రహస్యాన్ని తెలియజేయడంవల్ల తన వ్రతభంగానికి తానే కారకుడయ్యాడు. తన అజాగ్రత్తవల్ల తానే నాశమయ్యాడు.

డెలీలా సంసోనుని మభ్యపెట్టి తన వాడిలో నిద్రబుచ్చి అతని జడలు ఏడింటిని కత్తెర వేయించింది, దానితో అతని బలం పోయింది. ఆ యింటిలోనే ఓ మూలన దాగుకొని వున్న ఫిలిస్టీయ దొరలు వచ్చి అతనిమీద పడ్డారు. అతడు పూర్వంలాగ తన బలాన్ని ప్రదర్శించి శత్రువులనుండి తప్పించుకొందామనుకొన్నాడు. కాని ఆ బలం అతనిలో వుంటేగా! 53 సందర్భంలో బైబులు "ప్రభువు తన్ను విడనాడాడని సంసోనకి తెలియదు" అని చెప్తుంది — 16,21. ఇది బైబుల్లోని అతి దయనీయమైన వాక్యాల్లో వొకటి. తానెంతటి  దీనావస్థలో వున్నదికూడ సంసోనుకి అర్థంకాలేదు.
                                                               145