పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు కొలిచే బొమ్మలు మాత్రం ఏనాడూ జీవించవు
నరులు హేయమైన మృగాలనుగూడ,
వాటిల్లోను జ్ఞానం ఏమాత్రం లేనివాటినిగూడ,
పూజిస్తారు - 15, 15–29.
కీర్తన 115, 4-8 కూడ ఇదే ధోరణిలో విగ్రహాలు శక్తిరహితాలని వాకొంటుంది

39. మూఢవిశ్వాసాలు



కొందరు కలలను నమ్మి మోసపోతారు. అరుదుగా దేవుడు పంపే కలలను నమ్మవచ్చుగాని అన్ని కలలను నమ్మకూడదు. అలాగే సోదె, శకునాలు కూడ వట్టి బూటకాలు.
<poem>
మూరుడు లేనిపోని ఆశలవల్ల మోసపోతాడు
కలలవల్ల వారి ఆలోచనలు
రెక్కలు కట్టుకొని ఎగురుతాయి
స్వప్నాలను నమ్మడం నీడను పట్టుకోవడంలాంటిది
గాలిని తరమడం లాంటిది
అద్దంలో ముఖంలాగ
కలల్లో మన అనుభవాలే ప్రతిబింబిస్తాయి
కల్మషత్వంనుండి నిర్మలత్వం రాదు
నిజం కానిదానినుండి నిజమైంది రాదు
సోది, శకునాలు, కలలు నిజంకావు
అవి ప్రసవవేదనల్లో వున్న స్త్రీ వూహల్లాగ
వట్టి వూహలు మాత్రమే
సర్వోన్నతుడు పంపే కలలను నమ్మవచ్చు
కాని వట్టికలలను విశ్వసింపకూడదు
స్వప్నాలవల్ల చాలమంది అపమార్గం పట్టారు
వాటిని నమ్మి చాలమంది నిరాశ చెందారు - సీరా 34, 1-7.

ఇంకా కొందరు మంత్రవిద్యలు, అపవిత్రారాధనలు, నరబలులు, రహస్యపూజలు మొదలైనవాటికి పాల్పడతారు. ఇవన్నీ మూడాచారాలు , హేయమైన కార్యాలూ.

పూర్వం నీ పవిత్ర దేశంలో నివసించేవాళ్లు
హేయమైన కార్యాలు చేసారు గాన
నీవు వారిని అసహ్యించుకొన్నావు