పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని అతడు చావడానికీ
     అతని సొత్తు ఇతరులపాలు కావడానికీ
     ఇంకా యెన్నాళ్ళ వ్యవధి వుందో అతనికే తెలియదు కదా!
     పాపాత్ముల విజయాలను చూచి అసూయ చెందకు
     దేవుని నమ్మినీ పనులను నీవు శ్రద్ధగా జేయి
     క్షణకాలంలోనే దరిద్రుని సంపన్నుని జేయడం
     ప్రభువుకి కష్టంగాదు.
     ఉదయసాయంకాల మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చు,
     దేవుడు తలపెట్టిన మాఅతిశీఘంగా కలుగుతుంది - సీరా 11, 19-21, 18,26.

దుష్టులు వృద్ధిలోకిరావడం చూచి మనం సహించలేం. అసూయపడతాం. కాని వాళ్ళ త్వరలోనే దేవుని శిక్షకు గురౌతారు. కనుక మన అసూయ నిరర్థకమైంది.

37.అసూయ

పాపి విజయాన్ని చూచి అసూయ చెందవద్దు
    వాడికెట్టి వినాశం దాపరిస్తుందో నీ వెరుగవు
    దుపులు అనుభవించే ఆనందాన్ని ఆశింపకు
    బ్రతికి వుండగానే వారికి శిక్ష పడుతుంది - సీరా 9, 11-12.

నరునికి విచారమూ, కోపమూ, అసూయా పనికిరావు, సంతోషచిత్తత అతనికి మేలు చేస్తుంది.

విచారం వలన నరుడు
    ప్రాయం రాకముందే ముసలివా దౌతాడు
    అసూయ, కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి
    సంతోషచిత్తుడైన నరునికి బాగా ఆకలి వేస్తుంది
    అతడు తృప్తిగా భుజిస్తాడు - సీరా 30, 24-25.

ఇంకా అసూయ ఎముకల్లోపుట్టే కుళ్ళలాంటిది. కనుక దాన్ని ఆవశ్యం వదులుకోవాలి.

శాంతగుణం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి
    అసూయ ఎముకల్లో పుట్టిన కుళ్ళలాంటిది - సామె 14,30.