పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగాదాలకు దూరంగా వుండేవాడే ఘనుడు
కట్టెలు లేకపోతే మంటలు ఆరిపోతాయి
కొండెగాడు లేకపోతే కలహాలు అంతరిస్తాయి
నిప్పలకు బొగ్గులు, మంటలకు కట్టెలు,
జగడాలకు కలహప్రియుడు, అవసరం - సీరా 28, 8-12, 27,15. సామె 20,2. 26, 20-21.

35. వ్యభిచారం

నరుల్లో కామాగ్ని ఎప్పడూ కొలిమిలా మండుతూనే వుంటుంది. వ్యభిచారి నరుల కన్నుగప్ప జూస్తాడు. కాని దేవుని కన్నుకప్పలేడు. సూర్యునికంటె కాంతిమంతమైన నేత్రాలుకల దేవుడు పాపి పాపాలన్నీ గమనిస్తాడు. కనుక అతనికి శిక్ష తప్పదు.

కొలిమిలా మండే కామాగ్నిని ఎవరూ చల్లార్చలేరు
అది తన్నుతాను కాల్చివేసికొని ఆరిపోవలసిందే
కామవాంఛను తీర్చుకోడానికి జీవించే నరుని
కడన ఆ కామాగ్నే కాల్చి వేస్తుంది
ఆలాంటివాడు ప్రతిస్త్రీని కామిస్తాడు
ఆ దుషుడు జీవించి వున్నంతకాలం
అతని కామవాంఛ తీరదు
వివాహధర్మాన్ని మీరి వ్యభిచారానికి పాల్పడేవాడు
నన్నెవరు చూస్తారు?
ఇది చీకటివేళ, గోడలు అడ్డంగా వున్నాయ.
ఎవరు నన్ను గమనించరు, నాకు భయమెందుకు?
మహోన్నతుడైన ప్రభువు నా దోషాలను పట్టించుకోడు అని అనుకొంటాడు
నరులు తన్ను చూస్తారేమో అనే అతని భయం
కాని ప్రభువు నేత్రాలు సూర్యునికంటె
పదివేలరెట్లు కాంతిమంతంగా వుంటాయనీ
అవి మనం చేసే ప్రతికార్యాన్నీ
మన రహస్యాలన్నీ గమనిస్తాయనీ అతడెరుగడు
కనుక ఆ పాపి తానూహింపనప్పడు పట్టువ
బహిరంగంగా