పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరికి అదేరకపు అన్నం రుచించదు
విశిష్టాన్నాలమీద మక్కువ వదులుకో
ఎట్టి భోజనాన్నయినా మితంమీరి తినకు
అమితంగా తింటే రోగం వస్తుంది
భోజనప్రియత్వంవలన పిత్తం మదురుతుంది
భోజనప్రీతి వలన చాలమంది చచ్చారు
కావున ఈ విషయంలో జాగ్రత్తగా వుండి
నీ ఆయుస్సును పెంచుకో
 - సీరా 31, 12-20. 37, 27-31.

34. కలహాలు

సులభంగా తగాదాలకు దిగకూడదు. ఇతరుల మధ్య పోట్లాట పెట్టకూడదు. మొండివాడికి తగాదా లెక్కువ. కలహాలకు దూరంగా వుండేవాడు గొప్పవాడు. కట్టెలు మంటలను పెంచినట్లు కొండెగాళ్ళు కలహాలు పెంచుతారు. కనుక వాళ్ళను దూరంగా వంచాలి.

కలహాలు పరిహరిస్తే నీ పాపాలు తగ్గుతాయి
దుషుడు స్నేహితులమధ్య తగాదాలుపెట్టి
కలసివున్నవారిని విడదీస్తాడు
కట్టె కొలది మంటలల్ల
నరుడు బలవంతుడూ ధనవంతుడూ ఐనకొలది
అతని కోపం రెచ్చిపోతుంది
దిడీలున పుట్టుకవచ్చిన కలహం ఉద్రేకాన్ని పెంచుతుంది.
త్వరపడి కలహించేవాళ్ల రక్తపాతానికి ఒడిగడతారు
నిప్పరవ్వమీద ఊదితే మంటలేస్తుంది
దానిమీద ఉమ్మివేస్తే అది ఆరిపోతుంది
ఈ రెండు క్రియలను మన నోటితోనే చేస్తాం
గర్వాత్మల కలహాలు హత్యకు దారితీస్తాయి
వారి దూషణభాషణలను మనం వినలేం
అల్పుడు ఎవడైనా జగడాలు ఆడగలడు