పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరమాత్రులైనవారు కోపాన్ని అణచుకోలేకపోతే
ఇక అతనితప్పిదాలను ఎవడు మన్నిస్తాడు?
ద్వేషం తగాదాలను కొనివస్తుంది
కాని ప్రేమ అపరాధాలను కప్పి పెడుతుంది - సీరా 25, 14-15, 28,1-5.
సామె 10,12.

29. దురాశ తగదు

కొందరికి డబ్చే ఉరౌతుంది. పాపమార్గాన ధనం కూడబెట్టని ధనికుడు ధన్యుడు.
ధనాశ కలవాడు సత్పురుషుడు కాలేడు
డబ్బు చేసికోగోరేవాడు పాపం కట్టుకొంటాడు
డబ్బువలన చాలమంది నాశమయ్యారు
ధనంవలన వారు వినాశానికి చిక్కారు
ధనం వలన సమ్మోహితుడయ్యేవాడికి అది ఉరౌతుంది
మూర్ఖులు ఆ ఉరిలో తగులుకొంటారు
పాపమార్గాన డబ్బు కూడబెట్టనివాడూ,
నిర్దోషీ ఐన ధనికుడు ధన్యుడు
ఆలాంటివాడు దొరికితే అతన్ని అభినందించాలి
అతడు ధనికులెవ్వరూ చేయలేని అద్భుతాన్ని చేసాడు
ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కంగా గర్వించవచ్చు
పాపం చేయగలిగీ చేయనివాడూ,
పరుని మోసగింపగలిగీ మోసగించనివాడూ,
ఎవడైనా వుంటాడా? - సీరా 31, 5-10.

30. నిజాయితీ లేకపోవడం

కొందరు దొంగలాభాలకు పాల్పడతారు. మరి కొందరు దొంగతూకాలకు పూనుకొంటారు. దేవుడు వాళ్ళను అసహ్యించుకొంటాడు. వేరుకొందరు గట్టురాళ్ళను పీకివేస్తారు. ఇంకా కొందరు లంచాలు పుచ్చుకొంటారు. అది అన్నిటినీ సాధించి పెడుతుంది. వేరుకొందరు ముష్టికి కూడ పాల్పడతారు. దానివలన గౌరవమర్యాదలు నశిస్తాయి.