పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విచారం వలన నరుడు
ప్రాయం రాకముందే ముసలివా డౌతాడు
అసూయ కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి
అన్యునిపై కోపంతో మండిపడ్డం కంటె
అతన్ని మందలించడం మెరుగు.
పేదవాణ్ణి పీడించేవాడు
అతన్ని కలిగించిన సృష్టికర్తను అవమానిస్తాడు
దరిద్రుని గౌరవించేవాడు దేవుణ్ణి గౌరవిస్తాడు
పేదవాణ్ణి గేలిచేస్తే
అతన్ని సృజించిన దేవుణ్ణి గేలిచేసినట్లే.
- సీరా 11,24, 1,22-23, 10,8, 30,24, 20,2. సామె 14,31, 17,5.

28. పగను అణచుకోవాలి

పగ పామవిషం లాంటిది. కనుక సజ్జనుడు దాన్ని అణచుకోవాలి. మనం పరుల తప్పులను మన్నించకపోతే దేవుడు తన తప్పలను మన్నించడు. ద్వేషం వలన తగాదాలూ, ప్రేమవలన క్షమాపణ సిద్ధిస్తాయి.

అపకారాలన్నిటిలోను
శత్రువు చేసే అపకారం గొప్పది
ప్రతీకారాలన్నిటిలోను
పగవాని ప్రతీకారం ఘోరమైంది
పాము విషాన్ని మించిన విషం లేదు
పగతుని కోపాన్ని మించిన కోపం లేదు
ప్రభువు నరుని పాపాలన్నీ గమనిస్తాడు
పగతీర్చుకొనే నరునిమీద తాను పగతీర్చుకొంటాడు
నీవు తోడినరుని అపరాధాలను మన్నిస్తే
నీవు మొరపెట్టినపుడు
దేవుడు నీ యపరాధాలను మన్నిస్తాడు
నీవు తోడి నరునిమీద కోపంగా వుంటే
నిన్ను క్షమించమని భగవంతుణ్ణి ఏలా అడుగుతావు?
తోడి నరుని మన్నింపనివాడు
తన తప్పిదాలను మన్నింపమని
దేవుణ్ణి ఏలా వేడుకొంటాడు?