పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుక వినాశకారి. లోకంలో కత్తివలన చచ్చినవారికంటె నాలుక వలన చచ్చినవాళ్ళే యొక్కువ.

               కొరడాదెబ్బ ఒడలిమీద బొబ్బలు పొక్కిస్తుంది
               కాని దుష్టజిహ్వ ఎముకలనుగూడ విరగగొడుతుంది 
               కత్తివాతబడి చాలమంది చచ్చారు
               కాని నాలుకవాతబడి చచ్చినవాళ్లు ఇంకా యొక్కువ
               నాలుక ఉపద్రవానికి లొంగనివాడు,
               దాని ఆగ్రహానికి గురికానివాడు,
               దాని కాడిని మెడమీద పెట్టుకొని మోయనివాడు
               దాని గొలుసులచే బంధింపబడనివాడు - ధన్యుడు
               నాలుక కాడి యినుప కాడి
               దాని గొలుసులు ఇత్తడి గొలుసులు - సీరా 28,17-21.
       పొలానికి కంచె వేసినట్లు, పెట్టెకు తాళం వేసినట్లు, బుద్ధిమంతుడు నోటికి గడె వేసికోవాలి. 
              నీ పొలానికి ముండ్లకంచె వేస్తావు కదా!
              నీ ధనాన్ని పెట్టెలోబెట్టి తాళం వేస్తావు కదా! 
              అట్లే నీ ప్రతి పలుకుని తక్కెడలో బెట్టి తూయి 
              నీ నోటికి తలుపు పెట్టి గడె బిగించు
              నీ నాలుక వలన నీవు నాశమైపోకుండేలా,
              నీ పతనాన్ని ఆశించేవాని యెదుట
              నీవు వెల్లకిలపడకుండేలా, జాగ్రత్తపడు.
              కొందరి మాటలు బాకులవలె గుచ్చుకొంటాయి
             కాని బుద్ధిమంతుల పలుకులు మందులా మేలు చేస్తాయి
   - సీరా 28,17-21, 24-26. సామె 12,8.
              కొందరికి చాడీలు చెప్పే దుర్గణం వుంటుంది. కాని దీనివలన అవమానం
     తెచ్చుకొంటాం. బుద్ధిమంతుడు అసలు కొండాలు చెప్పకూడదు. 
             నీవు చాడీలు చెప్పడంలో దిట్ట వనిపించుకోవద్దు 
             నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు
             చోరులు అవమానానికి గురైనట్లే 

109