పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తముడు మృదువాక్కులు పల్కాలి. జీవనమరణాలు కూడ నాలుక అధీనంలోనే వుంటాయి. మృదువుగా మాట్లాడితే కోపం చల్లారుతుంది కటువుగా పలికితే ఆగ్రహం హెచ్చుతుంది కరుణాపూరితంగా మాట్లాడే జిహ్వ జీవవృక్షంలాంటిది కటువుగా మాట్లాడే నాలుక హృదయాన్ని ప్రయ్యలు చేస్తుంది నాలుకనుబట్టే నరుని జీవితముంటుంది జిహ్వనుబట్టే అతని జీవిత విధానముంటుంది జీవమూ మరణమూకూడ నాలుక అధీనంలో వున్నాయి నరుడు దాన్ని ఏలా వాడుకొంటాడో ఆలాంటి ఫలితాన్నే పొందుతాడు - సామె 15, 1.4 18,20-21. మూర్ణుడు ఆలోచనలేని పల్కులు పల్కి అపఖ్యాతి తెచ్చుకొంటాడు. వాడి మాటలే వాణ్ణి నాశం చేస్తాయి. అజ్ఞడు ఆలోచనలేక నోటికి వచ్చినట్లు వదరుతాడు జ్ఞాని చక్కగా ఆలోచించిగాని సంభాషించడు నీ మాటల వలననే నీకు ఖ్యాతి అపఖ్యాతికూడ కలుగుతుంది నీ నాల్క వలననే నీవు నాశం తెచ్చుకొంటావు - సీరా 21, 26, 5,13. వాచాలత తప్పలకు దారితీస్తుంది, వదరుబోతు పలుకులు చెత్తలాగ విలువలేనివి. అతిగా ప్రేలితే తప్ప దొరలక తప్పదు మౌనం వహించేవాడు వివేకి పుణ్యపురుషుని పల్కులు మంచి వెండి వంటివి

కాని దుష్టని భావాలు చెత్తలాంటివి - ਹੇ। 10,19-20.

మితభాషణం భూషణం. నోటికి వచ్చినట్లు పేలితే చెడ్డపేరు తెచ్చుకొంటాం. కొందరు మితంగా మాటలాడ్డంచే జ్ఞానులనబడతారు కొందరు అమితంగా మాటలాడ్డంచే

చెడ్డపేరు తెచ్చుకొంటారు 

ఏమి మాటలాడాలో తెలియక కొందరు మౌనంగా వుంటారు

107