పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు అంగీకరించందే ఏ జీవి మనుతుంది? అన్ని ప్రాణులూ నీవే గనుక నీవు ప్రతీ ప్రాణినీ కృపతో జూస్తావు నీవు బ్రతికివున్న ప్రాణులన్నిటినీ ప్రేమిస్తావు నాశంలేని నీయాత్మే ప్రతి ప్రాణిలోను నెలకొనివుంది - సాలోమోను జ్ఞాన

11,23- 12, 1.

2. దుష్టవర్తనం

24. మూర్ఖత్వం

ఇంతవరకు మనం నైతిక వర్తనాన్ని గూర్చి పరిశీలించాం. ఇకమీదట ఆ నైతిక

వర్తనాన్ని గూర్చి విచారిద్దాం. మొదట మూర్ధత్వాన్ని గూర్చి చూద్దాం. జ్ఞానానికి 

వ్యతిరేకమైంది మూర్ఖత్వం.

                       తోబీతు చెప్పినట్లు బుద్ధిమంతుడు జ్ఞానుల ఉపదేశాన్నిపాటిస్తాడు. "నాయనా! నీవు బుద్ధిమంతుల సలహాను పాటించు. మంచి ఉపదేశాన్ని ఎప్పడూ పెడచెవిని పెట్టవద్దు" -
418. కాని దుష్టుడు ఉపదేశాన్ని వినడు.

మూరులకు విద్యగరపబూనడం పగిలిపోయిన కుండపెంకులను అతికించడంలాగ, గాఢనిద్రలో వున్నవాణ్ణి లేపజూడ్డంలాగ, వ్యర్థమైన కార్యం మూర్జునికి బోధించడం నిద్రతో తూలేవానికి బోధించడం లాంటిది అంతా విన్నాక అతడు నీవేమి చెప్పావని అడుగుతాడు - సీరా 22,7-8. మందలింపును అంగీకరింపనివాడు పాపపు త్రోవలో నడుస్తాడు దైవభీతికలవాడు పరివర్తనం చెందుతాడు మూరునికి విజ్ఞానం అర్థంపర్థంలేని మాటలప్రోగు అది అతనికి కూలిపోయిన యింటిలా వుంటుంది అజ్ఞానికి ఉపదేశాన్ని ఆర్థించాలంటే

105