పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. మృత్యుస్మరణం

      మృత్యువుని ఎవడూ ఇష్టపూర్తిగా అంగీకరింపడు. కాని అందరమూ చావుకి లొంగవలసిందే.

ఓ మృత్యువా! ఆస్తిపాస్తులతో
హాయిగా కాలం గడిపేవానికి,
చీకూచింతా లేకుండ జీవిస్తూ
అన్నిట విజయం సాధించేవానికి,
కడుపునిండా తినగల శక్తికలవానికి,
నిన్ను గూర్చిన తలంపు ఎంత దుఃఖకరమైంది!
నాయనా! నీవు మృత్యుశాసనానికి భయపడనక్కరలేదు
నీ పూర్వులనూ నీ తర్వాతి వారినీ జ్ఞప్తికి తెచ్చుకో
ప్రభువు బ్రతికివున్నవారందరికీ మరణశిక్షవిధించాడు
మహోన్నతుని సంకల్పాన్ని కాదనడానికి నీవెవరివి?
నీవు జీవించేది పదేండ్లయినా, వెయ్యేండ్లయినా
మృత్యులోకంలో ఎవడూ పట్టించుకోడు - సీరా 41, 1-4.

దేవుడు మనలను చావడానికికాక, జీవించడానికే చేసాడు. మృత్యువు ఈ లోకంలో రాజ్యంచేయలేదు. పిశాచం నరుణ్ణిచూచి అసూయచెంది చావుని లోకంలో తెచ్చి పెట్టింది.

మృత్యువుని దేవుడు కలిగింపలేదు
ప్రాణులు చావడంజూచి అతడు సంతసింపడు
అతడు ప్రతి ప్రాణినీ జీవించడానికి సృజించాడు
అతడు చేసిన ప్రాణులన్నీ
ఆరోగ్యంతో అలరారుతున్నాయి
జీవులలో మరణకరమైన విషమేమీలేదు
మృత్యువు ఈ లోకంలో రాజ్యం చేయదు.
దేవుడు నరుణ్ణి అమరునిగా జేసాడు

అతన్ని తనవలె నిత్యునిగా జేసాడు కాని పిశాచం అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది పిశాచపక్షాన్ని అవలంబించేవారు చావుని