పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని విజ్ఞానాన్ని అనేకులు మెచ్చుకొంటారు
ఆ విజ్ఞానం ఏనాటికీ అంతరింపదు
భావితరాలవారు అతన్ని స్మరించుకొంటారు
అతని పేరు మాసిపోదు
అన్యజాతులు అతని విజ్ఞానాన్ని సన్నుతిస్తాయి
విద్వత్సభ అతన్ని కీర్తిస్తుంది
ముసలి ప్రాయందాకా జీవిస్తే అతడు సుప్రసిద్దుడౌతాడు
కీర్తిని పొందకముందే గతించినా అతనికి కొరతలేదు. - సీరా 39, 1-11

21. ఈ జీవితం అశాశ్వతం

నరులు ప్రాతబట్టలా చినిగిపోతారు. చెట్టమీది ఆకుల్లా రాలిపోతారు. ఈ జీవితం వ్యర్థమైంది. ఈ లోకంలో క్రొత్తయేమీలేదు. ఎప్పడూ జరిగిందే జరుగుతూ విసుగు పుట్టిస్తుంది. ముసలితనంతో, ఆ తర్వాత వచ్చే చావుతో, అంతా గతిస్తుంది. గొర్రెలకాపరి గొర్రెలనులాగ, మృత్యువు మనలను ఇక్కడినుండి తోలుకొనిపోతుంది.

ప్రాణులన్నీ జీర్ణవస్త్రంలాగ శిధిలమైపోతాయి
పురాతన నియమం ప్రకారం
జీవకోటికి మృత్యువు తప్పదు
గుబురుగా ఎదిగిన చెట్టమీద ఆకులు
కొన్ని పండి రాలిపోతూంటే
కొన్ని చిగుర్చుతూంటాయి
తరతరాల నరజాతికి ఈ గతే పడుతుంది
కొందరు చనిపోతూంటే మరికొందరు పుడుతూంటారు
నరుడు సాధించిన ప్రతి కార్యం నశిస్తుంది
ఆ కార్యాన్ని సాధించిన నరుడూ గతిస్తాడు. - సీరా 14, 17-19
ఉపదేశకుడు ఈ జీవితం వ్యర్ధమని చెప్తున్నాడు. వ్యర్థం, అంతా వ్యర్థమే. నరుడు ఈ భూమిమీదపడే నానా పాట్లకూ ఫలిత మేముంది? - ఉప 1, 2-3,

     ప్రతిదినం విసుగు పుట్టించేదే. ఈ విసుగుని వర్ణించడానికి మాటలు చాలవు. మన కండ్లు అవి చూచిన వస్తువులతోగాని, మన చెవులు అవి విన్న సుద్దులతోగాని సంతృప్తి చెందవు. పూర్వం జరిగిన కార్యాలే యిప్పడూ జరుగుతున్నాయి. నరులు పూర్వం చేసిన పనులే మరల చేస్తున్నారు. లోకంలో క్రొత్త యేమీలేదు. ఇది క్రొత్తది అనే దాన్ని